సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Apr 25, 2020 , 02:58:38

కరోనా కట్టడిలో సఫలీకృతం

కరోనా కట్టడిలో సఫలీకృతం

  • కలెక్టర్‌ శరత్‌తో ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తల భేటీ
  • కొవిడ్‌ 19 పరీక్షలు, జిల్లా పరిస్థితులపై చర్చ
  • సోమవారం నుంచి ర్యాపిడ్‌ టెస్టులపై యాక్షన్‌ ప్లాన్‌

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఆయా రాష్ర్టాల్లో పకడ్బందీ చర్యలు తీసుకుంటుండగా కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్‌ విస్తృతి తగ్గుముఖం పడుతున్న ది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందిందా? లేదా.. అనే అంశాలతోపాటు వైరస్‌ విస్తృతి తీవ్రతను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రయోగానికి సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా 25 రాష్ర్టాల్లో 82 జిల్లాల్లో ర్యాపిడ్‌ టెస్టులకు గాను ఆదేశాలు జారీ చేసింది. ఇందులో  రాష్ట్రంలో మూడు జిల్లాలకు చోటు దక్కింది. అందులో నల్లగొండ, జనగామ జిల్లాలతో పాటు వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్న కామారెడ్డి జిల్లా సైతం ఉంది. ఈ జిల్లాల్లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలోని బృందాలు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టబోతున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో ఐ సీఎంఆర్‌ శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇం దులో భాగంగా ఐసీఎంఆర్‌ నిపుణులు శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చారు. మం త్రి ప్రశాంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి,  అధికారులతో భేటీ అయ్యారు. ర్యాపిడ్‌ పరీక్షలు చేపట్టే విధానాలపై వారు  చర్చించారు.

సోమవారం నుంచి ర్యాపిడ్‌ పరీక్షలు...

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కామారెడ్డి జిల్లాలో ర్యాపిడ్‌ కొవిడ్‌ టెస్టులను సోమవారం నుంచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు పూర్తి షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. సోమవారం 10 బృందాలు జిల్లాకు వస్తా యి. జిల్లా వ్యాప్తంగా నిర్దేశిత ప్రాంతాల్లో వీరంతా కలియ తిరుగుతారు.  400 మందికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో బృందం 10 కుటుంబాలను అందులో ఒక యువకుడు, ఒక మహిళ, ఒక చిన్నారి, ఒక వృద్ధుడు ఇలా వయస్సును ఆధారంగా చేసుకుని పరీక్షలు నిర్వహిస్తారు. వీటి ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సంపూర్ణ అవగాహనకు రానున్నారు.  

ఐసీఎంఆర్‌ పరీక్షలకు సహకారం అందిస్తాం...

జిల్లాలో కరోనా వైరస్‌ వెలుగు చూసిన నాటి నుంచి యంత్రాంగం అంతా కష్టపడి పని చేసి కట్టడి చేయగలిగాం. ప్రజలంతా యంత్రాంగానికి సహకరించడంతోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించిన కరోనా తక్కువగా ఉన్న జిల్లాల జాబితాలో కామారెడ్డికి చోటు లభించింది. ఐసీఎంఆర్‌ బృం ద సభ్యులు తమను వచ్చి కలిశారు. వారికి జిల్లా యంత్రాంగం తరపున ర్యాపిడ్‌ పరీక్షలకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తాం.

- ఎ.శరత్‌, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌


logo