గురువారం 28 మే 2020
Nizamabad - Apr 22, 2020 , 02:03:03

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

నమస్తే తెలంగాణ యంత్రాంగం: కరోనా వైరస్‌వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతున్నది. మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.  బ్యాం కులకు వచ్చే ఖాతాదారులు సామాజిక దూరం పాటించేలా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి అవగాహన కల్పించారు. కామారెడ్డి పట్టణంలోని 47వ వార్డులో డ్రోన్‌కెమెరాతో లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. ఎల్లారెడ్డిలో డీఎస్పీ శశాంక్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. 

వాహనాల సీజ్‌.. కేసులు

కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 6006 వాహనాలను సీజ్‌ చేసినట్లు ఎస్పీ శ్వేతారెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన దుకాణ యజమానులకు  కామారెడ్డి, భీమ్‌గల్‌, నవీపేటలో అధికారులు జరిమానా విధించారు. మాస్కులు ధరించకుండా సరుకులు విక్రయిస్తున్న 20 మందిపై బాన్సువాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిర్మల్‌ జి ల్లా గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద నాలుగు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశారు.


logo