గురువారం 28 మే 2020
Nizamabad - Apr 21, 2020 , 02:43:51

పేదలకు అండగా ఐకేఆర్‌ ఫౌండేషన్‌

పేదలకు అండగా ఐకేఆర్‌ ఫౌండేషన్‌

  • కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సేవా కార్యక్రమాలు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు చేయూతనందించడం, విద్యార్థులకు ఉచిత కోచింగ్‌, పేదలకు చేతనైన సాయం చేస్తున్న ఐకేఆర్‌ ఫౌండేషన్‌.. తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగా నిర్మల్‌ జిల్లాలో పేదలకు, కూలీలు, కార్మికులు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు ఆకలి తీర్చేందుకు అవసరమైన భోజన వసతి కల్పిస్తున్నది. కరోనా నియంత్రణలో సేవలందిస్తున్న సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 220మంది ఆశ వర్కర్లు, వెయ్యి మంది మున్సిపల్‌ కార్మికులకు, ఐకేఆర్‌ ఫౌండేషన్‌ తరపున అందజేశారు. అత్యవసర సిబ్బందికి ఇటీవల మాస్క్‌లు, శానిటైజర్లు మంత్రి అల్లోల చేతుల మీదుగా ట్రస్టు చైర్మన్‌ అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి అందించారు. మంత్రి స్వగ్రామం ఎల్లపల్లిలో వలస కూలీ లు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మరో మూడు వేల మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించారు.

పేదలను ఆదుకునేందుకే..

ఐకేఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా 2015 నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కూలీలు, నిరుపేదలు ఉపాధి కోల్పోవడంతో ఫౌండేషన్‌ ద్వారా వారికి అండగా నిలుస్తున్నాం. నిరుపేదల ఆకలి తీర్చేందుకు నిత్యావసర సరుకులు, వలస కూలీలు, పేదలు, లారీ డ్రైవర్ల కోసం అన్నదాన కార్యక్రమం ప్రారంభించాం. వివిధ రకాల సేవలందిస్తున్న వారికి నిత్యావసర సరుకులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నాం.

- అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి, ఫౌండేషన్‌ కన్వీనర్లు


logo