శనివారం 30 మే 2020
Nizamabad - Apr 18, 2020 , 00:39:17

నిజామాబాద్‌లో 58కి చేరిన పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌లో 58కి చేరిన పాజిటివ్‌ కేసులు

  • ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం నాటికి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 58కి చేరింది. శుక్రవారం 32 శాంపిల్స్‌కు సంబంధించి రిపోర్టులు వచ్చాయని, అవన్నీ కూడా నెగిటివ్‌ వచ్చాయని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం వరకు జిల్లా నుంచి మొత్తం 608 శాంపిల్స్‌ పంపామని, అందులో 498 రిపోర్టులు వచ్చాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించి ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని, అప్పుడే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు. అనవసరంగా బయటకు వస్తే పోలీసులు వాహనాలు సీజ్‌ చేస్తారని,  కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. మాస్కులు లేకుండా  బయటకు రావొద్దని, బయటకు తప్పనిసరై వస్తే మాస్కులతోనే రావాలని, పాన్‌పరాగ్‌, చూయింగ్‌ గమ్‌ నమలడం నిషేధించడం జరిగిందని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే కేసులు బుక్‌ చేస్తామని తెలిపారు. కరోనా వైరస్‌, ఇతర విధులు నిర్వహించే వైద్య సిబ్బంది, వైద్యులు, ఆశవర్కర్లపై దాడులు చేస్తే జైలుకు పంపిస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. దీనిని జిల్లావ్యాప్తంగా పక్కాగా అమలు చేస్తామన్నారు.


logo