ఆదివారం 31 మే 2020
Nizamabad - Apr 18, 2020 , 00:35:23

సాయం చేయడం అభినందనీయం

సాయం చేయడం అభినందనీయం

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: లాక్‌డౌన్‌ సమయంలో రేషన్‌కార్డు లేని పేదలకు టీఆర్‌ఎస్‌ నాయకులు ముందుకొచ్చి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని పచ్చలనడ్కుడలో 40 మందికి, మోర్తాడ్‌లో 40 మందికి, కమ్మర్‌పల్లిలో 30 మందికి 10 కిలోల చొప్పున బియ్యంతో పాటు పప్పు, నూనె, కూరగాయలు, తదితర నిత్యావసర సరుకులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన పిలుపునందుకొని పేదలకు సహాయం చేసినందుకు టీఆర్‌ఎస్‌ నాయకులకు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం 74 లక్షల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకుల కోసం రూ.1500 చొప్పున అందజేసిందన్నారు. పార్టీ క్యాడర్‌ ఇలాంటి మంచి పనిచేసినందుకు టీఆర్‌ఎస్‌ పార్టీకి, తనకు గర్వంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. 

మహిళా సంఘాల మాస్కుల సేవలు అభినందనీయం 

కరోనా నియంత్రణకు గాను మాస్కులు తయారుచేసి అందిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సేవలు అభినందనీయమని మంత్రి  ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కమ్మర్‌పల్లికి వచ్చిన మంత్రికి మహిళా సంఘాలు తయారుచేసిన మాస్కులను ఐకేపీ ఏపీఎం కుంట గంగారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాస్కులను పరిశీలించి బాగున్నాయని మెచ్చుకున్నారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతి నిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo