గురువారం 28 మే 2020
Nizamabad - Apr 16, 2020 , 03:44:22

ప్రజలు సహకరించాలి

ప్రజలు సహకరించాలి

  • లాక్‌డౌన్‌తోనే వైరస్‌వ్యాప్తి నియంత్రణ
  • మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో కరోనా వైరస్‌వ్యాప్తి నియంత్రించగలిగామని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. మే3వ తేదీ వరకు అమలులో ఉండే లాక్‌డన్‌కు ప్రజలు సహకరించాలని అన్నారు.  కరోనా వైరస్‌ బారినపడి జిల్లాలో ఇప్పటివరకు  ఇద్దరు మృతిచెందగా, 19 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. 408 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 370మందికి సంబంధించిన ఫలితాలు వచ్చాయన్నారు. జిల్లాలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, దాతలు సైతం స్వచ్ఛందంగా ముందుకువచ్చి సహకారం అందించడం అభినందనీయమన్నారు. వైరస్‌ బారినపడిన వారికి వైద్యం అందించడంతో పాటు వైరస్‌ అనుమానం ఉన్న వారికీ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న 3242 మందికి ఈనెలలో 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. 

రైతులు సామాజికదూరం పాటించాలి

రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి లక్ష క్వింటాళ్లు కొనుగోలు చేసిందన్నారు. క్వింటాలుకు రూ.1760 మద్దతు ధర చెల్లించి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు సామాజికదూరం పాటించాలని సూచించారు.  సమావేశంలో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ఎస్పీ శశిధర్‌రాజు, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ తదితరులు  పాల్గొన్నారు.


logo