సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Apr 13, 2020 , 02:06:10

ప్రజాసేవలో గల్లీ వారియర్స్‌

ప్రజాసేవలో గల్లీ వారియర్స్‌

  • ప్రతివార్డులో నలుగురైదుగురి నియామకం
  • 19 వార్డుల్లో నిత్యం సేవలు
  • కంటైన్‌మెంట్‌ జోన్లలో నిత్యావసరాల అందజేత
  • స్థానికులు బయట తిరగకుండా కాపలా

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి: కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రజలు ఇబ్బందులు పడకుం డా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 19 వార్డుల్లో స్థానిక యువకులను గల్లీ వారియర్స్‌గా నియమించి ప్రజలకు అవసరమైన సరుకులను వారితో పంపిణీ చేయిస్తున్నారు. ఆయా వా ర్డుల్లో ప్రజలు బయట తిరగకుండా గల్లీ వారియర్స్‌ కాపలా ఉంటున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాలను కం టైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఆదిలాబాద్‌ పట్టణంలో ఏడుగురికి కరోనా సోకగా.. వారు నివాసముండే ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలో 19 వార్డులున్నాయి. ఇవన్నీ కంటైన్‌మెంట్‌ జోన్‌ కిందకి వస్తాయి.  ఈ ప్రాంతాల్లో దుకాణాలను పూర్తిగా మూసివేసి, రహదారులకు అడ్డుకట్టలు వేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు లాంటి వాటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ప్రజలకు అవసరమైన వాటిని సమకూర్చడం కోసం గల్లీ వారియర్స్‌ను నియమించారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా..

పట్టణంలోని 19 వార్డుల్లో దాదాపు ఐదుగురు స్థానిక యువకులను గల్లీ వారియర్స్‌గా నియమించారు. వారికి అధికారులు ఐడీ కార్డు లు అందజేశారు. వీరి ఫోన్‌నెంబర్లు స్థానికులకు తెలిపారు. ప్రజలకు రోజువారీగా అవసరమైన పాలు, కూరగాయలు, కిరాణా సామగ్రి, వంటగ్యాస్‌, మందులు తదితరవి గల్లీ వారియర్స్‌ పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం వార్డుల ప్ర త్యేకాధికారులు, జోనల్‌ అధికారులు, కౌన్సిల ర్లు వారికి సహకారం అందిస్తున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటి ఎవరూ బయటకు రాకుండా గల్లీ వారియర్స్‌ కాపలా కాస్తున్నారు. గల్లీ వారియర్స్‌ సేవలు బాగున్నాయని కంటైన్‌మెంట్‌జోన్‌ ప్రజలు అంటున్నారు. సేవ చేయడం సంతోషంగా ఉందని గల్లీ వారియర్స్‌ చెబుతున్నారు.


logo