శనివారం 06 జూన్ 2020
Nizamabad - Apr 12, 2020 , 03:00:03

ఇల్లు కదలొద్దు.. బయటకు రావొద్దు!

ఇల్లు కదలొద్దు.. బయటకు రావొద్దు!

  • కరోనా వైరస్‌ నిరోధానికి కీలక సమయమిది 
  • లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు యంత్రాంగం సిద్ధం
  • కేసుల పెరుగుదలతో అప్రమత్తమైన ప్రభుత్వం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. వైరస్‌ విస్తృతికి అడ్డుకట్ట వేసేందుకు తొలి నుంచి కీలకమైన అడుగులు వేయగా.. ప్రస్తుతం మరిం త సీరియస్‌గా దృష్టిసారించింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి నుంచి వేగంగా పాజిటివ్‌ కేసు లు పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో  కేసులు పెరుగుతుండడంతో మిగిలిన ప్రాం తాల్లోనూ అలర్ట్‌ చేశారు. లాక్‌డౌన్‌ వందశాతం అమలు చేసి ప్రజలను ఇండ్లకే పరిమితం చేసేలా యంత్రాంగం కృషిచేస్తున్నది. నిత్యావసరాలు, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మిన హా అనవసరంగా రోడ్డెక్కి తిరిగే వారిపై పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఈనెల 15 తర్వాత లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన ఆవశ్యకతను సీఎం కేసీఆర్‌ ఇప్పటికే తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా యంత్రాంగం సైతం సమాయత్తమవుతున్నది. మరికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్‌ పాటించేలా ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు.

బిజీ బిజీగా...

కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల ఆదేశాలను  తప్పకుండా అమలుచేసేందుకు జిల్లాస్థాయిలో కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి విశేషంగా కృషిచేస్తున్నారు. ఓ వైపు ప్రజాప్రతినిధులకు తోడుగా అధికార యంత్రాంగాన్ని నిరంతరం పనిచేయించడానికి కృషిచేస్తున్నారు. నిత్యం సమీక్షలు, సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. జిల్లాలో కేసులు ఎక్కువ నమోదైన బాన్సువాడలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 64 మందికి కరోనా నెగెటివ్‌ రిపోర్టులు వచ్చాయి. 10 మందికి పాజిటివ్‌ నిర్ధారణ జరిగింది. బుధవారం బాన్సువాడలో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలడంతో వారితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇప్ప టి వరకు 18 మంది నమూనాలు పంపించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో దగ్గరగా ఉన్న మరికొంత మంది వ్యక్తులను గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.  

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా బాన్సువాడ పట్టణంలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించి చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి అదుపులో ఉంది. లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతున్నది.  


logo