ఆదివారం 31 మే 2020
Nizamabad - Apr 12, 2020 , 02:57:10

ఉల్లంఘనలపై ఉక్కుపాదం

ఉల్లంఘనలపై ఉక్కుపాదం

నమస్తే తెలంగాణ యంత్రాంగం : ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ శనివారం 18వ రోజూ కొనసాగింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌, ఇంద్రవెల్లి, బేల, జైనథ్‌ తదితర మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌లో పాల్గొన్నారు. బిచ్కుందలో ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అధికారులతో సమీక్షను నిర్వహించారు.  కామారెడ్డి జిల్లా బీబీపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, బీర్కూర్‌ మండలాల్లో పోలీసులు, అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు జాగ్రత్తలను వివరించారు. కామారెడ్డి-మెదక్‌ జిల్లా  సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి పరిశీలించారు. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు పర్యటించారు. ప్రజలు రోడ్లపైకి రావొద్దని సూచించారు. దస్తురాబాద్‌, కుభీర్‌, ఖానాపూర్‌ మండలాల్లో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఖానాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగాయి. నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, నందిపేట, ఆర్మూర్‌, మాక్లూర్‌ తదితర మండలాల్లో లాక్‌డౌన్‌ కొనసాగింది. నందిపేటలోని బర్కత్‌పుర ఏరియాను ఆర్డీవో శ్రీనివాస్‌ పరిశీలించారు.  

లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై కేసులు.. 

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన పలువురిపై అధికారులు కేసులు నమోదు చేశారు. నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాందలో నిబంధనలను పాటించకుండా దుకాణం తెరచిన వ్యక్తితో పాటు వాహనాలు నడిపిన ఏడుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్‌ తెలిపారు. భైంసాలో ఐదు ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశామని ఎస్సై యాసిర్‌ అరాఫత్‌ అన్నారు.  కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,961 వాహనాలను సీజ్‌ చేసినట్లు ఎస్పీ శ్వేతారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక దూరం పాటించని 15 దుకాణాల యజమానులపై, అనుమతి లేకుండా తెరిచిన 17 షాపులపై, ఎనిమిది హోటళ్లు, టీ స్టాళ్ల వద్ద, గుమిగూడిన ఐదుగురు వ్యక్తులపై, పరిమితికి మించి వాహనంలో ప్రయాణించిన ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా 2,062 వా హనాలు సీజ్‌ చేసినట్లు సీపీ కార్తికేయ తెలిపారు. ఇందు లో ద్విచక్ర వాహనాలు1420, ఆటోలు 555, ఫోర్‌ వీల ర్లు 87 ఉన్నాయని పేర్కొన్నారు. 


logo