సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Apr 12, 2020 , 02:54:58

‘క్వారంటైన్లు’ ఖాళీ!

‘క్వారంటైన్లు’ ఖాళీ!

  • నిర్మల్‌లో మరో రెండు పాజిటివ్‌ కేసులు

కరోనా అనుమానితులను ఉంచిన క్వారంటైన్లు ఖాళీ అవుతున్నాయి. వారి శాంపిళ్లు హైదరాబాద్‌కు పంపగా.. నెగెటివ్‌ వచ్చిన వారిని అధికారులు ఇంటికి పంపుతున్నారు. కామారెడ్డి జిల్లాలో రెండు క్వారంటైన్లు పూర్తిగా ఖాళీ కాగా.. నిర్మల్‌లో మరో 140 మంది అనుమానితులు మాత్రమే క్వారంటైన్‌లో ఉన్నారు. హోం క్వారంటైన్‌కు వెళ్లిన వారిపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు.

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : నిర్మల్‌ జిల్లాలో ఓవైపు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా.. మరోవైపు అనుమానితుల 14 రోజుల నిర్బంధం పూర్తి కావడంతో క్వారంటైన్లు ఖాళీ అవుతున్నాయి. శనివారం మరో రెండు కేసులు నమోదు కావడం తో జిల్లాలో పాజిటివ్‌ కేసులు 15కు చేరాయి. ఇప్పటికే జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతిచెందగా.. 17మంది సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. జిల్లా లో 335 మంది శాంపిళ్లను పరీక్షల కోసం పంపించగా.. 229 మంది నివేదికలు వచ్చా యి. శనివారం 55 శాంపిళ్ల నివేదికలు రాగా.. ఇందులో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వీరు నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌, మార్కెట్‌ ఏరియాకు చెందిన వారు. వీరిని గాంధీ దవాఖానకు తరలించారు. వీరిద్దరూ మర్కజ్‌ వెళ్లి వచ్చినవారే. వీరికి సంబంధించిన 33 మంది ని క్వారంటైన్‌ చేశారు. జిల్లాలో 6 క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 450 మందికి అవసరమైన బెడ్లను అందుబాటులో ఉంచా రు. 14రోజుల నిర్బంధం పూర్తయిన తర్వాత అనుమానితులను ఇండ్లకు పంపిస్తున్నారు. జిల్లాలో 81 మంది మాత్రమే క్వారంటైన్‌లో మిగలగా.. మరో 33 మందిని శనివారం క్వారంటైన్‌కు పంపారు. దీంతో జిల్లాలో 114 మంది మాత్ర మే క్వారంటైన్‌లో ఉన్నారు. జిల్లాలో 19 మం డలస్థాయి, 396 గ్రామస్థాయి, 20 పట్టణ, 1086 స్నేహపూర్వక సర్వైలెన్స్‌ బృరైదాలు పనిచేస్తున్నాయి. జిల్లాలో 11 కంటైనెమెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. నిర్మల్‌లో గాజులపేట్‌, జోహ్రానగర్‌, గుల్జార్‌ మార్కెట్‌, నర్సాపూర్‌ (జి) మండలం చాక్‌పెల్లి, భైంసాలో పాండ్రిగల్లీ, మదీనాకాలనీ, కడెం, లక్ష్మణచాంద మండలం రాచాపూర్‌, కనకాపూర్‌, మామడ మండలం న్యూలింగంపల్లి, పెంబి మండలం రాయదారిని కంటైనెమెంట్‌  జోన్లుగా ప్రకటించారు. ఇక్కడ రోడ్లు మూసివేసి హైడ్రోక్లోరైట్‌ పిచికారీ, ఇంటింటి సర్వే, హోంక్వారంటైన్‌, సామాజిక దూరం, ఇంటికి సరుకుల పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 6,022 మంది వలస కూలీలకు 12కిలోల చొప్పున 72.132 మెట్రిక్‌ టన్నుల బియ్యం, ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున రూ. 30,05,500 పంపిణీ చేశారు. జిల్లాలో శనివారం కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగింది. బయటకు వచ్చిన వాహనదారుల వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. 

17కు చేరిన కరోనా  కేసులు

నిర్మల్‌ పట్టణంలో తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు శనివారం కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. 

ఇందూరులో మరో రెండు కేసులు : కలెక్టర్‌ 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌ జిల్లాలో మరో రెండు కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు శనివారం కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 49కు చేరాయని, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి సంబంధించి శాంపిళ్లు ఇప్పటికే వైద్య పరీక్షలకు పంపామని, శనివారం 103 మంది శాంపిల్స్‌ పరీక్షలకు పంపినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని రిపోర్టులు వచ్చాయని, మరికొన్ని రావాల్సి ఉందని తెలిపారు. జిల్లాకు సంబంధించి వచ్చేవారం అత్యంత కీలకమైనదని, ప్రజలందరూ  ఇండ్లకే పరిమితం కావాలని కలెక్టర్‌ సూచించారు.   

క్వారంటైన్‌ టు హోం!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి జిల్లాలో 10 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వారితో సంబంధం ఉన్న వారందరినీ గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించింది. ఢిల్లీ వెళ్లొచ్చిన ముగ్గురు బాన్సువాడ వ్యక్తులకు కరోనా సోకింది. వీరితో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న 97 మంది అనుమానితులను స్థానిక బాన్సువాడ మైనార్టీ గురుకులానికి తరలించారు. వీరిలో 76 మంది రిపోర్టులు రాగా.. ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఢిల్లీ వెళ్లొచ్చిన ముగ్గురితో పాటు ఆరుగురు స్థానికులకు పాజిటివ్‌ రావడంతో జిల్లా యంత్రాంగం బాన్సువాడను రెడ్‌జోన్‌గా ప్రకటించింది. ప్రభుత్వ క్వారంటైన్‌ నుంచి నెగిటివ్‌ వచ్చిన వారంతా ఇంటికి వెళ్లగా.. 21 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దోమకొండ ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్న 10 మందికి నెగిటివ్‌ రావడంతో ఇండ్లకు పంపించారు. ఎల్లారెడ్డిలోనూ 28 మంది అనుమానితులను గుర్తించి పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగిటివ్‌ వచ్చింది. ప్రభుత్వ క్వారంటైన్‌ నుంచి వీరిని హోం క్వారంటైన్‌కు తరలించారు. దీంతో జిల్లాలోని మూడు క్వారంటైన్లలో  రెండు ఖాళీ అయ్యాయి. జిల్లాలో 1272 మంది విదేశాల నుంచి వచ్చిన వారు, 1007 మంది వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వారందరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. తొలి దశ హోం క్వారంటైన్‌ సమయం పూర్తయినప్పటికీ  వీరి కదలికలపై నిఘా కొన సాగుతున్నది.


logo