గురువారం 28 మే 2020
Nizamabad - Apr 10, 2020 , 02:26:49

ప్రజలు రోడ్లపైకి రావడంపై కలెక్టర్‌ ఆగ్రహం

ప్రజలు రోడ్లపైకి రావడంపై కలెక్టర్‌ ఆగ్రహం

  • చప్పట్లు కొట్టి వైద్యసిబ్బంది సేవలకు అభినందన 

ఎదులాపురం : లాక్‌డౌన్‌ ఉన్నా ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన పలువురిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లోని పలు వార్డుల్లో ఆమె గురువారం పర్యటించారు. అత్యవసరమైతే తప్పా ఇండ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రం నుంచి ఇండ్లకు వెళ్తున్న వారితో మాట్లాడుతూ.. ఇంటికి వెళ్లినా సామాజిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని సూచించారు. అబ్దుల్లా చౌక్‌లో వైద్య సిబ్బంది సర్వేను పరిశీలించిన ఆమె వారిని చప్పట్లు కొట్టి అభినందించారు. పలువురు వృద్ధులు, పిల్లలకు కలెక్టర్‌ మాస్క్‌లను అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచిన గణేశ్‌ జిరాక్స్‌ సెంటర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.


logo