శనివారం 06 జూన్ 2020
Nizamabad - Apr 09, 2020 , 03:00:11

తూర్పున ప్రశాంతం.. పశ్చిమాన పరేషాన్‌

తూర్పున ప్రశాంతం.. పశ్చిమాన పరేషాన్‌

  • ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలను కలవరపెడుతున్న కరోనా
  • పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు..ఆందోళనలో ప్రజలు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ప్రపంచదేశాలను వణికిస్తున్న కొవిడ్‌ -19 (కరోనా వైరస్‌) ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను కూడా తాకింది. ఉమ్మడి జిల్లా ప్రస్తుతం నాలు గు జిల్లాలుగా విభజించబడగా గతంలో తూ ర్పు, పశ్చిమ జిల్లాలుగా ఉండేవి. పశ్చిమ జి ల్లా పరిధిలో ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలు ఉండగా తూర్పు జిల్లా పరిధిలో మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ పశ్చిమ జిల్లాను పరేషాన్‌ చేస్తున్నది. తూర్పు జిల్లాలో ప్రభావం లేకపోవడంతో ప్రశాంతంగా ఉంది. పశ్చిమ జిల్లా పరిధిలో మొత్తం 22 కేసులు నమోదు కాగా ఇం దులో ఆదిలాబాద్‌ జిల్లాలో 11, నిర్మల్‌ జిల్లా లో 11 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.

నిర్మల్‌ జిల్లాలో ఒకరు మృతి చెందగా ప్రస్తుతం పది పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి.  ఆదిలాబాద్‌ జిల్లాలో 11 పాజిటివ్‌ కేసు లు కాగా ఇందులో 10 కేసులు మర్కజ్‌ నుంచి వచ్చిన వారివే కావడం గమనార్హం. ఒక్క కేసు మాత్రం ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా వచ్చింది. తూర్పు జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. మంచిర్యాల జిల్లా నుంచి ఇద్దరు మర్కజ్‌ వెళ్లి వచ్చినప్పటికీ నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ఒక ఇంజినీర్‌ ఇటలీ వెళ్లి రాగా ఆయనకు కూడా నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. 11 మంది శాంపిళ్లు పంపగా అందరికీ నెగెటివ్‌ రావడంతో అధికార యం త్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి నలుగురు మర్కజ్‌ వెళ్లగా ముగ్గు రు తిరిగి వచ్చారు. వీరికి నెగెటివ్‌ రాగా మరొకరు అక్కడే ఉన్నారు. 25 శాంపిళ్లు పంపించగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది. దీంతో తూర్పు జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు రాకపోవడం ఊరటనిచ్చే అంశం.

పదకొండుకు చేరిన పాజిటివ్‌ కేసులు

నిర్మల్‌ జిల్లాలో బుధవారం మరో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 11 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు నివేదికలు రాగా.. ఇందులో ఒకరు ఇప్పటికే చనిపోయారు.  ఆరు పాజిటివ్‌ కేసుల్లో నిర్మల్‌కు చెందిన ఇద్దరు, లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌, రాయదారి, మామడ మండలం న్యూలింగంపల్లి, పెంబి మండలం రాయదారికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన 11కేసుల్లో ఐదుగురు మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారు ఉన్నారు. మరొకరు మర్కజ్‌కు వెళ్లిరాగా.. ఇటీవల హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో గుండెపోటుతో చనిపోయారు. ఆ కుటుంబానికి చెందిన ఇద్దరికి తాజాగా కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వచ్చింది. దీంతో జిల్లాలో తొలిసారిగా ప్రైమరీ కాంటాక్టు ద్వారా రెండు కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటివరకు నమోదైన ఐదు కేసులు మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారికి కాగా.. తాజాగా నాలుగు కేసులు వేరేవి నమోదయ్యాయి. ఈ నలుగురిలో ఇద్దరు ఇతర దేశాల నుంచి రాగా.. మరో ఇద్దరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు.  ఇప్పటి వరకు నిర్మల్‌, భైంసా పట్టణాల్లోనే పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ప్రస్తుతం గ్రామాల్లో కూడా వెలుగుచూడడం ఆందోళన కలిగించే అంశం.

గ్రామాలను సందర్శించిన కలెక్టర్‌

జిల్లాలో బుధవారం పాజిటివ్‌ కేసులు నమోదైన పలు గ్రామాలను కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సందర్శించారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో గ డువు పూర్తయిన, నెగెటివ్‌ వచ్చిన 11మందిని ఇండ్లకు పంపించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

నర్సాపూర్‌(జీ) తహసీల్‌ ఆఫీసుకు తాళం

నర్సాపూర్‌(జీ): నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జీ) తహసీల్‌ ఆఫీస్‌ను బుధవారం లాక్‌డౌన్‌ చేశారు. కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి గత నెల ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి వెళ్లిరాగా, సదరు వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో సిబ్బంది ఆందోళన చెందారు. ఆఫీస్‌లో  పనిచేసే ఉద్యోగులందరినీ తమ ఇండ్ల వద్దనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు   నర్సాపూర్‌(జీ) మండలానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు దిలావర్‌పూర్‌ తహసీల్‌ నుంచి నిర్వహిస్తారని పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో..

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలోని హస్నాపూర్‌ గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భావేశ్‌ మిశ్రా అన్నారు.  కరోనా కట్టడిలో భాగంగా వారు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. బుధవారం ఆయన హస్నాపూర్‌ను సందర్శించి కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మనోహర్‌ను అడిగి తెలుసుకున్నారు. మాస్కులు, శానిటైజర్లు సరిపడా తెప్పించుకోవాలని సూచించారు.  గ్రామంలో 1,159 ఇండ్లు ఉండగా, మొత్తం 4,384 మంది ఉన్నారని  తెలిపారు.  ప్రస్తుతం 69 మంది వైద్య సిబ్బందిసిబ్బంది 23 బృందాలుగా ఏర్పడి సమీక్షిస్తున్నారని తెలిపారు. కరోనా  వైరస్‌పై ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

నిజామాబాద్‌ జిల్లాలో అధికారులు అప్రమత్తం

రాష్ట్రంలోనే హైదరాబాద్‌ తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత అప్ర మత్తంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం సైతం కలెక్టర్‌ నారాయణరెడ్డి కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. బోధన్‌కు చెందిన  ఐదుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో పట్టణంలో పలు ప్రాంతాలను అధికారులు కంటైన్‌మెంట్‌ ప్రాంతాలుగా  గుర్తించి రాకపోకలను బంద్‌ చేశారు. బోధన్‌- నిజామాబాద్‌ రహదారి ఆచన్‌పల్లి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డును మూసివేశారు. రెంజల్‌ మండలంలోని కందకుర్తికి చెందిన ఒకరికి పాజిటివ్‌ రాగా, సదరు వ్యక్తి నివాస ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ ఏరియాగా గుర్తించి పూర్తి గా దిగ్బంధం చేశారు.  మాక్లూర్‌ను కంటైన్‌మెంట్‌ ఏరియాగా ప్రకటించారు.  


logo