శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Apr 05, 2020 , 03:02:07

‘మర్కజ్‌' అలజడి!

‘మర్కజ్‌' అలజడి!

  • ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకేరోజు 10 కరోనా పాజిటివ్‌ కేసులు
  • మర్కజ్‌ వెళ్లివచ్చిన 45 మందికి పరీక్షలు
  • 73 మంది నమూనాల సేకరణ
  • పాజిటివ్‌ కేసులు ‘గాంధీ’కి తరలింపు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో ఒక్కసారిగా ‘మర్కజ్‌' కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఆదిలాబాద్‌లో పది మందికి కరోనా పాజిటివ్‌ అని వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి: కొద్దిరోజులుగా ప్రపంచదేశాలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్న కరోనా వైరస్‌ జిల్లాను తాకింది. ఇన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న జిల్లా తబ్లిగీ జమాత్‌ కారణంగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా వ్యాప్తంగా 73 మంది మర్కజ్‌కు వెళ్లిరాగా వారిలో 45 మంది కరోనా పరీక్షల రిపోర్టులు వచ్చాయి. వీరిలో 10 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. ఆదిలాబాద్‌ పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు గురికి, నేరడిగొండకు చెందిన ముగ్గురికి, ఉట్నూర్‌ మం డలం హస్నాపూర్‌కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ వ చ్చింది. ఇంకా 28 మంది రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది. పాజిటివ్‌ వచ్చిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు.

ఆందోళనలో ప్రజలు

జిల్లాలో ఒకే రోజు పది కరోనా కేసులు నమోదు కావడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులు కరోనా వైరస్‌ ప్రబలకుండా పక్కా ప్రణాళికలతో పకడ్బందీ చర్యలు చేపట్టారు. విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌ చేయడంతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలనూ మూసివేశారు. అధికార యంత్రాంగం అనుమానితులను గుర్తించడంతో పాటు ఈ మహమ్మారి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది.  పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు లు నమోదు చేశారు.  

పది మందికి పాజిటివ్‌..

తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి జిల్లా నుంచి 73 మంది వెళ్లారు.ఆదిలాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు ఉట్నూర్‌, నేరడిగొండ, మావల నుంచి మర్కజ్‌కు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వీరు గత నెల 15,16,17,18 తేదీల్లో తమ గ్రామాలకు చేరుకున్నారు. వైద్యశాఖ సిబ్బం ది నాలుగు రోజుల క్రితం మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో కొందరిని ఆదిలాబాద్‌ ఐసోలేషన్‌కు, చాందా (టీ) మైనా ర్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలోని క్వారంటైన్‌కు తరలించారు. మర్కజ్‌కు వెళ్లిన 73 మంది రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. ఇందులో 45 మంది రిపోర్ట్స్‌రాగా 10 మందికి పాజిటివ్‌ వచ్చింది.  ఇంకా 28 మంది రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది. మర్కజ్‌ వెళ్లివచ్చిన వారు ఎందరితో కాంటాక్ట్‌ అయ్యారోనని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఐసోలేషన్‌ వార్డులో  కరోనా పాజిటివ్‌గా వచ్చిన వారిని గాంధీ దవాఖానకు తరలించారు. జిల్లాలో కరోనా వ్యాప్తి  చెందకుండా అన్ని చర్య లూ తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. హస్నాపూర్‌ గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడం తో అధికారులు సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రే చేశారు.


logo