గురువారం 28 మే 2020
Nizamabad - Apr 01, 2020 , 01:57:57

వలస కార్మికులకు ఆపన్నహస్తం

వలస కార్మికులకు ఆపన్నహస్తం

నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 11,061 మంది వలస కార్మికులు ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. వీరిలో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు రూ. 500 ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు 8,600 మందికి బియ్యం పంపిణీ చేసి ఆర్థిక సాయాన్ని అందజేశారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలో... 

జిల్లాలో 6612 మంది వలస కూలీలు, కార్మికులను అధికారులు గుర్తించారు. వీరిలో 5899 మందికి నిత్యావసర సరుకులు అవసరం కాగా, 126 మందికి నివాసం లేకపోవడంతో అధికారులు ఆశ్రయం కల్పిస్తున్నారు. 138 మందికి వైద్య సౌకర్యాలు అవసరమని గుర్తించి రిమ్స్‌తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం పొందేలా చర్యలు తీసుకున్నారు. 103 మంది యాచకులను గుర్తించి వారిని రిమ్స్‌ ఆవరణలోని పునరావాస కేంద్రానికి తరలించారు. జిల్లావ్యాప్తంగా వలస కార్మికులు 1,170 మందికి మంగళవారం వరకు 140.40 క్వింటాళ్ల బియ్యం, రూ.5.85 లక్షల నగదును అందజేశారు.  

నిర్మల్‌ జిల్లాలో...

జిల్లాలో 6,011 మంది వలస కార్మికులున్నట్లు గుర్తించగా.. వీరిలో మొత్తం మందికి 12కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. సోమ, మంగళవారాల్లో బియ్యం పంపిణీ చేయగా.. కొందరికీ రూ. 500 చొప్పున నగదును కూడా అందించారు. నగదు కొరతతో మిగతా వారికి రూ. 500 నగదు బుధవారం అందిస్తామని అధికారులు తెలిపారు. 


logo