శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Mar 30, 2020 , 01:44:24

ఖిల్లా ప్రాంతంలో సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

ఖిల్లా ప్రాంతంలో సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఖిల్లా ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ రావడంతో అక్కడి ప్రజల ఆ రోగ్య వివరాలను సర్వే చేస్తున్న నేపథ్యంలో నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆ ప్రాం తంలో పర్యటించారు. ఢిల్లీలో పర్యటించి వచ్చిన నగరంలోని ఖిల్లా ప్రాంతానికి ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ ఉన్నట్లు మూడు రో జుల క్రితం నిర్ధారణ కావడంతో అతనిని గాంధీ దవాఖానకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? వారికి ఏమైనా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నా యా? తదితర విషయాలను సేకరించడానికి ఖిల్లా ప్రాంతంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బం ది, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌ శాఖల యంత్రాంగం సర్వే నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్‌ ఆదివారం ఖిల్లా ప్రాంతం లో పర్యటించారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో పాటు ఢిల్లీ వెళ్లి వచ్చిన 39 మందిని, ఆయన కలిసిన 55 మందిని క్వారంటైన్‌లో ఉంచిన ట్లు కలెక్టర్‌ నారాయ ణరెడ్డి పేర్కొన్నారు. ఆ వ్యక్తి కలిసిన వ్యక్తులు, ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి లో కూడా ఎవరికి కూడా కరోనా వైరస్‌ లక్ష ణాలు లేవని అయినప్ప టికీ  పరిశీలన కోసం వారందరిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలి పారు. ఎవరైనా ప్రజలకు దగ్గు, జ్వరం, జలు బు అనారోగ్య పరిస్థితులు ఉంటే సంబంధిత పీహెచ్‌సీ లేదా ప్రభుత్వ దవాఖానకు పం పించాలని,కంట్రోల్‌ రూం నంబర్‌ 08462-220183కు ఫోన్‌ చేసి ఈ వివరాల ను అం దిస్తే  చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.  


logo