గురువారం 28 మే 2020
Nizamabad - Mar 29, 2020 , 02:05:16

సామాజిక దూరం.. కరోనాకు కళ్లెం..

సామాజిక దూరం.. కరోనాకు కళ్లెం..

  • ఆరో రోజూ కొనసాగిన లాక్‌డౌన్‌
  • పర్యవేక్షించిన ఎమ్మెల్యేలు  జీవన్‌రెడ్డి,  హన్మంత్‌షిండే
  • నిజామాబాద్‌లో 24 వాహనాలు సీజ్‌
  • కొనసాగుతున్న  పోలీస్‌ పహారా
  • నిత్యావసరాల కొరత రాకుండా చర్యలు చేపడుతున్న యంత్రాంగం
  • సమీక్షించిన కలెక్టర్లు

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతున్నది. ప్రజలు సామాజిక దూరం పాటించేలా  కృషిచేస్తున్నది. ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించడం లేదు. సామాజిక దూరం పాటించనందుకు నిజామాబాద్‌లో రెండు సూపర్‌ మార్కెట్లను శనివారం అధికారులు సీజ్‌ చేశారు. కాగా, జిల్లాలో ఆరోరోజూ శనివారం లాక్‌డౌన్‌ కొనసాగగా.. నిబంధనల మేరకు కిరాణా దుకాణాలు, డెయిరీలు, మెడికల్‌ షాప్‌లు తెరిచారు.  నగరంలో ఐదు మొబైల్‌ రైతు బజార్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీపీ కార్తికేయ హెచ్చరించారు. ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆర్మూరులో అధికారులతో సమీక్షించి పట్టణంలో పర్యటించారు.కరోనా వైరస్‌ కట్టడికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పిట్లం, జుక్కల్‌, నిజాంసాగర్‌ మండలాల్లో పర్యటించి లాక్‌డౌన్‌ను  పర్యవేక్షించారు. కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నిత్యావసరాల కొరత లేకుండా, బ్లాక్‌ మార్కెట్‌ చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌  కలెక్టర్‌ నారాయణరెడ్డి వీసీలో నగర కార్పొరేటర్లతో మాట్లాడారు. 

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ/ భీమ్‌గల్‌/ మోర్తాడ్‌/ వేల్పూర్‌/ బాల్కొండ (ముప్కాల్‌)/ ఏర్గట్ల/ మెండోరా/ మాక్లూర్‌/ నందిపేట్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో కొనసాగుతున్నది. కమ్మర్‌పల్లి మండలంలో అధికారులు విదేశాల నుంచి వచ్చిన వారి ఇండ్ల కు వెళ్లి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. బషీరాబాద్‌లో స ర్పంచ్‌, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి అవగాహన కల్పించారు. భీమ్‌గల్‌ పట్టణ కేంద్రం లో తెరిచి ఉంచిన రెండు షాపులకు మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌ రూ. వెయ్యి చొప్పున శనివారం జరిమానా విధించారు.  కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా తనవంతు బాధ్యతగా టీఆర్‌ఎస్‌ మోర్తాడ్‌ గ్రామ అధ్యక్షుడు తక్కూరి సతీశ్‌ వంద మాస్కులను త హసీల్దార్‌ శ్రీధర్‌కు అందజేశారు. మోర్తాడ్‌ మండలంలోని వడ్యాట్‌లో అత్యవసర సేవల కోసం గ్రామస్తులకు ఉచితంగా వాహ న సౌకర్యాన్ని కల్పించినట్లు సర్పంచ్‌ వెల్మరూప తెలిపారు. వేల్పూర్‌కు చెందిన సర్పం చ్‌ తీగల రాధ గ్రామానికి చెందిన గర్భిణిని చికిత్స కోసం ఆమెను తన సొంత వాహనం లో ఆర్మూర్‌లోని దవాఖానకు తరలించా రు. పోచంపల్లికి చెందిన గర్భిణికి పురిటి నొ ప్పులు రావడంతో సర్పంచ్‌ అనంత్‌రావు తన కారులో ఆర్మూర్‌లోని దవాఖానకు తరలించారు. బాల్కొండ, ముప్కాల్‌ మండల కేంద్రాల్లో కరోనా వైరస్‌ కట్టడి చర్యలు కొనసాగుతున్నాయి. ముప్కాల్‌ మండలం రెంజర్లలో విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పై డాక్టర్‌ సరిత, తహసీల్దార్‌ జయంత్‌రెడ్డి, ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి అవగాహన కల్పించా రు. ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్‌లో సర్పంచ్‌ భీమనాతి భానుప్రసాద్‌, గ్రామ పంచాయతీ సిబ్బంది వలస కూలీల సర్వే ని ర్వహించారు. ఏర్గట్లలో సర్పంచ్‌ లావణ్య మహిళలకు కరోనా వైరస్‌పై అవగాహన క ల్పించారు. మెండోరా మండలంలోని గ్రా మాల్లో చెక్‌ పోస్టుల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బందికి మండల యువజన సంఘం, పోచంపాడ్‌ గ్రామ యువజన సంఘ సభ్యులు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాక్లూర్‌ మండలంలోని సట్లాపూర్‌, అమ్రాద్‌, మదన్‌పల్లి, ఒడ్యాట్‌పల్లి, ముత్యంపల్లి గ్రామాల్లో ఎంపీడీవో సక్రియానాయక్‌ ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. ఎస్సై సాయినాథ్‌ మాక్లూర్‌, మానిక్‌బండార్‌ వద్ద బందోబస్తు నిర్వహించారు. నందిపేట్‌ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. బంద్‌ సందర్భంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.


logo