శనివారం 06 జూన్ 2020
Nizamabad - Mar 28, 2020 , 02:22:15

లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి

లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి

  • మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిలిపివేత
  • అధికారుల పర్యవేక్షణలో గ్రామాలు

భీమ్‌గల్‌/ మోర్తాడ్‌/ కమ్మర్‌పల్లి/ మెండోరా/ ఏర్గట్ల/ ముప్కాల్‌/ వేల్పూర్‌/ మాక్లూర్‌/ నందిపేట్‌/ నందిపేట్‌ రూరల్‌: కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని పలువురు అధికారు లు కోరారు. బాల్కొండ, ఆర్మూర్‌ నియోజక వర్గాలోని గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. భీమ్‌గల్‌ మండలంలోని అన్ని మసీదుల్లో సామూహిక ప్రార్థనలను నిలిపివేసినట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. మెండోరాలో ముస్లిం మత పెద్దలతో మాట్లాడి ప్రార్థన మందిరానికి తాళం వేయించారు. పురాణిపేట్‌లో విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారి ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. భీమ్‌గల్‌ పట్టణంలోని తొమ్మిదో వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ మాస్కులను ఉచితంగా అందజేశారు. కూరగాయల మార్కెట్లో మార్కింగ్‌ వేయించారు. మోర్తాడ్‌ మండలంలోని సుంకెట్‌లో ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారికి స్పిరిట్‌ స్ప్రే చేసి పంపిస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వై ద్యాధికారులు ప్రతిపాదించిన ఐసోలేషన్‌ వార్డును ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ శ్రీధర్‌ పరిశీలించారు. మోర్తాడ్‌ మండలంలోని గ్రామాల్లో తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో సద్గుణ, ఎంపీవో శ్రీనివాస్‌రెడ్డి, నాయబ్‌ తహసీల్దార్‌ బిం గి జనార్దన్‌ కరోనా వైరస్‌పై ప్రజలకు పలు సూచనలు చేశా రు. కమ్మర్‌పల్లిలో లాక్‌డౌన్‌ను డీఎల్‌పీవో శ్రీనివాస్‌ పరిశీలించారు. కమ్మర్‌పల్లిలో కూలీలకు ఇబ్బందులు  ఎదురైతే తన సొంత ఖర్చులతో సహకారం అందిస్తానని సర్పంచ్‌ గడ్డం స్వామి తెలిపారు. ఉప్లూర్‌లో లాక్‌డౌన్‌ను ఎంపీడీవో సంతోష్‌రెడ్డి పరిశీలించారు. కమ్మర్‌పల్లి మండలం కోనసముందర్‌లో ఐదు పేద కుటుంబాలకు అమ్మఒడి స్వచ్ఛంద సంస్థ సభ్యులు నిత్యావసర వస్తువులను అందజేశారు.  మరో పేద కుటుంబానికి వైద్య ఖర్చు ల కోసం రూ. 3 వేల నగదు అందజేశారు. మెండోరా మండలంలోని పోచంపాడ్‌లో సర్పంచ్‌ మిస్బా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సతీశ్‌ ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు.  ఏర్గట్ల మండల కేం ద్రంలో ఆర్మూర్‌ డీఎల్‌పీవో శ్రీనివాస్‌ సర్పంచ్‌ లావణ్య తో కలిసి తనిఖీలు నిర్వహించారు. మండలంలోని తాళ్లరాంపూర్‌లో ఎంపీటీసీ అడెం సవిత పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ముప్కాల్‌ మండల కేంద్రంలో పోలీసులకు మాస్కులు, ఎనర్జీ డ్రింక్‌లను అందించినట్లు లయన్స్‌ క్లబ్‌ మండల అధ్యక్షుడు పెండెం జీవన్‌ తెలిపారు. కరోనా నియంత్రణకు వేల్పూర్‌ ఎస్‌బీఐలో విధులు నిర్వహిస్తున్న క్యాషియర్‌ డేవిడ్‌ ప్రభుత్వ సహాయ నిధికి రూ. 10 వేలు ఆర్థిక సహాయాన్ని తహసీల్దార్‌ సతీశ్‌రెడ్డికి అందజేశారు. మసీదు పెద్దలతో మాట్లాడి సామూహిక ప్రార్థనలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్మూర్‌ పట్టణంతో పాటు గ్రామాల్లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది రోడ్లపై, రద్దీ ప్రాంతాల్లో కరోనా వ్యాధిని నివారించేందుకు రసాయనాలు కలిపిన నీటిని పిచికారీ చేశారు. మాక్లూర్‌, మా దాపూర్‌లో ఎస్సై సాయినాథ్‌ మసీదుల వద్ద బందోబస్తు నిర్వహించారు. ముల్లంగి(బి)లో విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారి ఇళ్లకు పోస్టర్లను అతికించారు. అడవిమామిడిపల్లిలో సర్పంచ్‌ చింత మల్లారెడ్డి గ్రామస్తులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉచితం గా స్పిరిట్‌, చేతులకు వేసే గ్లౌసులను అందజేశారు. నందిపేట్‌ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. అమ్మానాన్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బస్టాం డ్‌, ఆలయాల వద్ద అనాథలు, నిరుపేదలకు అన్నం ప్యాకెట్లను అందజేశారు. కరోనా నియంత్రణకు నందిపేట్‌ మం డలంలోని గాదేపల్లి సర్పంచ్‌ నక్కల భూమేశ్‌, తొండాకూర్‌ సర్పంచ్‌ కుర్మె దేవన్న, బాద్గుణ సర్పంచ్‌ భోజారెడ్డి, లక్కంపల్లి సర్పంచ్‌ మూడ సుమలత, పలు గ్రామాల సర్పంచులు తమ నెల వేతనాన్ని సీఎం సహాయ నిధికి పంపనున్నట్లు తెలిపారు. నందిపేట్‌ మండలంలోని  అన్ని గ్రామాల్లోకి ఎవరూ రాకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు కట్టడి చేస్తున్నారు. అధికారులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు.


logo