సోమవారం 25 మే 2020
Nizamabad - Mar 26, 2020 , 02:35:31

కరోనా రక్కసిని తరిమికొడదాం

కరోనా రక్కసిని  తరిమికొడదాం

  • ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు భేష్‌
  • ఇదే స్ఫూర్తి కొనసాగాలి 
  • మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 
  • ఉమ్మడి జిల్లాల్లో సమీక్షలు

నమస్తే తెలంగాణ ప్రతినిధులు, కామారెడ్డి/ నిజామాబాద్‌ :  సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కరోనా రక్కసి ప్రబలకుం డా అధికార యంత్రాంగంతో పాటు, ప్రజా ప్రతినిధులు సైతం నియంత్రణ చర్యల్లో భాగస్వాము లు అవుతున్నారని, కరోనా రక్కసిని కలిసికట్టుగా తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్‌ నగరంలోని కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరం, కామారెడ్డిలోని కలెక్టరేట్‌లో కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో  సమీక్ష నిర్వహించారు. అనంత రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, స్వీయ నియంత్రణ, స్వీయ గృ హ నిర్బంధం విషయంలో ప్రజల్లో విస్తృత అవగాహన పెరిగిందన్నారు. ఉమ్మడి జిల్లా యం త్రాంగం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు సంతృప్తిగా ఉన్నాయని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ మహమ్మారి భారతదేశంలో తక్కువ శాతం ప్రభావం చూపిందని, ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని అన్నారు. ఇందులో భాగంగానే 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ నిర్వహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరూ ఇండ్లలోనే ఉండాలని, సా మాజిక దూరాన్ని పాటించడమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. గల్ఫ్‌ దేశాల్లో  ఈ వ్యాధి ప్రబలిన నేపథ్యంలో ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో 2,600 మంది, కామారెడ్డిలో 1, 076 మంది విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారని, వీరిని హోం క్వారంటైన్‌లో ఉంచి పరీక్షిస్తున్నారని, బయటకు వెళ్లనీయకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 14 రోజుల పాటు వీరంతా స్వీ య గృ హ నిర్బంధంలో ఉండాలన్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠినచర్యలు తీసుకుంటామని, కేసులు పెడతామని హెచ్చరించారు. నిరుపేదలను ఈ ఆపత్కాలంలో ఆదుకునేందుకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 12 కిలోల చొప్పున ఉచితంగా రేషన్‌ బియ్యం అందించడంతో పాటు ఒక్కో కార్డు దారునికి  రూ.1500 లను బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు.  అత్యవసర సేవలందించే ప్రతి ఒక్కరూ  ఐడీ కార్డులు కలిగి ఉండాలని, త్వరలో వీరందరికీ జిల్లా యం త్రాంగం తరఫున పాసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికి రెండు రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు పేర్కొన్నారు.  ప్లాన్‌ -ఏ ను విజయవంతంగా అమలు పరిస్తే, ఐసోలేషన్‌ వార్డుతో అవసరముండదని, స్వీయ గృహ నిర్బంధం పాటిద్దామని పిలుపునిచ్చారు. గ్రామాల స్వీయ నిర్బంధంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నదని కితాబునిచ్చారు. గ్రామాల్లో నాకాబందీ ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డిలను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అభినందించారు. ఇదే స్ఫూర్తితోనే ముందుకు సాగాలని కోరారు. సమావేశంలో సీపీ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ  శ్వేతారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


logo