గురువారం 28 మే 2020
Nizamabad - Mar 26, 2020 , 02:31:28

పల్లె.. పట్నం.. స్వీయ నిర్బంధం..

పల్లె.. పట్నం.. స్వీయ నిర్బంధం..

  • మరింత పకడ్బందీలా లాక్‌డౌన్‌ అమలు
  • ఇంటికే  పరిమితమైనజనం
  • గ్రామాల్లో కొనసాగిన నిర్బంధాలు
  • నిర్మానుష్యంగా కనిపించినరహదారులు
  • ఇండ్లల్లోనేపండుగ నిర్వహించుకున్న ప్రజలు 
  • సీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రజాప్రతినిధులు

కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ మూడోరోజూ బుధవారం జిల్లాలో మరింత పకడ్బందీగా అమలైంది. జనం ఇండ్లకే పరిమితం కావాలని మంగళవారం పీఎం నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌ మరోసారి పిలుపునివ్వడంతో  ప్రజలు కట్టుబడి ఉన్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లేందుకు సాహించలేదు. యంత్రాంగం సైతం మరింత కఠిన చర్యలకు ఉపక్రమించింది.   గ్రామాల్లో కంచెల ఏర్పాటు.. నిర్బంధాలు కొనసాగాయి. ఏ రోడ్డు చూసినా నిర్మానుష్యంగానే కనిపించింది. సరిహద్దుల్లో రోడ్ల మూసివేత కొనసాగగా.. చెక్‌పోస్టుల వద్ద అధికారుల బృందాలు విధులు నిర్వర్తించాయి. సీఎం సూచనలతో ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కామారెడ్డి, నిజామాబాద్‌లో అధికారులతో సమీక్షించారు. ప్రజలు భయాందోళన చెందవద్దన్నారు. అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న రోగులతో  మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌, మార్కెట్లలో పర్యటించారు.తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందడి ఇంటికే పరిమితమైంది. ప్రజలు ఇండ్లలోనే ఉండి పండుగ నిర్వహించుకున్నారు. 

బోధన్‌రూరల్‌ / నవీపేట /  రెంజల్‌ / ఎడపల్లి /  కోటగిరి / రుద్రూర్‌ / వర్ని / చందూర్‌ : కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం  ఈ నెల 31వ  తేదీ వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌ బోధన్‌ డివిజన్‌లో కొనసాగుతున్నది. మూడోరోజైన బుధవారం గ్రామదారులన్నింటినీ సర్పంచులు, గ్రామస్తు లు మూసేశారు. బోధన్‌ మండలంలోని అ మ్దాపూర్‌, ఊట్‌పల్లి, రాజీవ్‌నగర్‌ తండా గ్రా మస్తులు ‘మా ఊరికి రావద్దు’ అంటూ వేడుకున్నారు. సాలూర శివారులోని అంతర్రాష్ట్ర ర హదారిని మూసివేశారు. మండలంలోని పెగ డాపల్లి, కల్దుర్కి గ్రామాలను తహసీల్దార్‌ గఫా ర్‌మియా  సందర్శించారు. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నవీపేట మండలంలోని మోకన్‌పల్లి, యంచ, నవీపేట తదితర  గ్రామాల్లో రోడ్లకు అడ్డంగా ముళ్లకంచెలు, జేసీబీలు, వాహనాలు అడ్డంగాపెట్టారు. గ్రామాల్లోకి కొత్త వారినెవరినీ అనుమతించ లేదు. యంచ లో జేసీబీతో రోడ్లను తవ్వించారు. నవీపేట సర్పంచ్‌ శ్రీనివాస్‌ యాచకులకు అన్నం పొట్లాలను అందించారు. మహారాష్ట్ర -  తెలం గాణ సరిహద్దు పొలిమేరల్లోకి రాకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుం టున్నది. రెంజల్‌ మండలం కందకుర్తి పొ లిమేరలో  కరోనా వైరస్‌ వ్యాప్తి  చెందకుం డా పోలీస్‌, రెవెన్యూ, ఆరోగ్య, రవాణా శాఖ పర్యవేక్షణలో రౌండ్‌ ది క్ల్లాక్‌గా పని చేస్తున్నారు. మండల వైద్యాధికారిణి క్రిస్టి నా కందకుర్తి వద్ద ఏర్పాటు చేసిన  కేంద్రా న్ని  సందర్శించారు. ఎడపల్లి మండలంలోని 12 గ్రామాలు లాక్‌డౌన్‌ ప్రకటించా యి. బాపూనగర్‌, జైతాపూర్‌, బ్రాహ్మణ పల్లి, ఏఆర్‌పీక్యాంప్‌, జంలం, సాటాపూర్‌ గేట్‌, ఎంఎస్‌సీఫారం, ధర్మారం, వడ్డేపల్లి, అంబం గ్రామాల్లో కల్లువిక్రయాలు జరుగుతున్నాయి. బెల్ట్‌ షాపుల ద్వారా దాబా హోటళ్లలో  మద్యం విక్రయిస్తున్నా రన్న ఆరోపణలున్నాయి. సిట్టింగ్‌లు పెట్ట కుండా ఇండ్లలో ఉన్న స్టాకును రెట్టింపు రేటుకు విక్రయిస్తున్నారు. దండం పెడ తాం.. మా ఊళ్లోకి ఎవరూ రావొద్దని కోటగిరి మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు వేడు కుంటున్నారు. మండలకేంద్రంతో పాటు సుం కిని, పొతంగల్‌, హంగర్గాఫారం, సోంపూర్‌, కొడిచెర్ల తదితర గ్రామాల జనాలు రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు వేశారు. మరికొందరు తాళ్లు అడ్డంగా కట్టారు. రుద్రూర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో రహదారులను దిగ్బంధించారు. వర్ని మండలంలోని ఆయా గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ఊర్లకు ఎవరూ రాకుండా దారులను దిగ్బంధం చేశారు. చందూర్‌ మండలంలో రాకపోకలను కట్టుదిట్టం చేశారు.

విదేశాల నుంచి వచ్చిన వారి పాస్‌పోర్టులు స్వాధీనం 

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎడప ల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో బు ధవారం అధికారులు 57 మంది పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.  వి దేశాల నుంచి 61 మంది రాగా.. వీరి లో 57 మంది పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమా ర్‌ తెలిపారు.  మిగితా వారు మండలం లో నివాసం ఉండని కారణంగా వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్నారు. నవీపేట మండలానికి గల్ఫ్‌ దేశాల నుంచి ఇటీవల వచ్చిన 99 మంది పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్‌ లత తెలిపారు. కోటగిరి  మండలానికి ఇటీవల గల్ఫ్‌ నుంచి వచ్చిన 16 మంది పాస్‌పోర్టులను తహసీల్దార్‌ విఠల్‌, ఎంపీడీవో మహ్మద్‌ అతారుద్దీన్‌ స్వాధీనం చేసుకున్నారు.


logo