బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 21, 2020 , 03:00:48

ఐదుగురి నామినేషన్లు ఓకే

ఐదుగురి నామినేషన్లు ఓకే

  • పరిశీలన ప్రక్రియ పూర్తి 
  • ఇద్దరు ఇండిపెండెంట్ల నామినేషన్లు తిరస్కరణ
  • బరిలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ 
  • 23న నామినేషన్ల ఉపసంహరణ 

నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక  నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు అధికారులు ఓకే చెప్పారు. ఇద్దరు ఇండిపెండెంట్లు వేసిన నామినేషన్లలో సరైన పత్రాలు లేకపోవడంతో వీటిని తిరస్కరించారు. ఈ మూడు పార్టీల అభ్యర్థులతో పాటు మరో ఇద్దరు వేసిన నామినేషన్లు ఓకే అయ్యాయి. అందులో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ తరపున లోయపల్లి నర్సింగ్‌రావు ఉన్నారు. వీరిద్దరు 23న నామినేషన్లు ఉపసంహరించుకోనున్నారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 23తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు అవకాశం ఉంది. 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం అభ్యర్థులు వేసిన నామినేషన్ల స్క్రూటినీ  ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు అధికారులు ఓకే చెప్పారు. ఇద్దరు ఇండిపెండెంట్లు వేసిన నామినేషన్లలో సరైన పత్రాలు లేకపోవడంతో వీటిని తిరస్కరించారు. ఈ మూడు పార్టీల అభ్యర్థులతో పాటు మరో ఇద్దరు వేసిన నామినేషన్లు ఓకే అయ్యాయి. అందులో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ తరపున లోయపల్లి నర్సింగ్‌రావు ఉన్నారు. వీరిద్దరూ 23న నామినేషన్లు ఉపసంహరించుకోనున్నారు. ఆయా పార్టీల నుంచి బీ- ఫామ్‌లతో నామినేషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో వీరిరువురు నామినేషన్లను ఉపసంహరించుకుంటారు. దీంతో ఇప్పటి వరకు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు వేసిన నామినేషన్లకు అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 

స్క్రూటినీ ప్రక్రియ పూర్తి... 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి చివరి రోజైన 19వ తేదీ వరకు వచ్చిన నామినేషన్లను నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి చింతకుంట నారాయణరెడ్డి పరిశీలించారు. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్లను శుక్రవారం పరిశీలించాల్సి ఉన్న నేపథ్యంలో, తన చాంబరులో ఎన్నికల సాధారణ పరిశీలకుడు వీరబ్రహ్మయ్య పర్యవేక్షణలో సంబంధిత అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్థి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ అభ్యర్థి సుభాష్‌రెడ్డి నామినేషన్లు సరైన పద్ధతిలో ఉన్నట్లు గుర్తించారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు మోహన్‌రెడ్డి, నర్సింగ్‌రావు నామినేషన్లు కూడా సరిగ్గా ఉన్నట్లు తెలిపారు. శ్రమజీవి పార్టీ తరపున నామినేషన్‌ వేసిన జే భాస్కర్‌ ఫారం -2ఈలో వివరాలు సరిగా లేవని, మరో స్వతంత్ర అభ్యర్థి కె. శ్రీనివాస్‌ ఫారం 26లో సమర్పించిన అఫిడవిట్‌ వివరాలు పూర్తిగా లేనందున తిరస్కరించినట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ల పరిశీలనలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo