శనివారం 30 మే 2020
Nizamabad - Mar 20, 2020 , 01:39:18

టీఆర్‌ఎస్‌ బలం@ 597

టీఆర్‌ఎస్‌ బలం@ 597

ఉభయ జిల్లాల్లో ఓటర్లు మొత్తం - 824

టీఆర్‌ఎస్‌ సంఖ్యాబలం 597 (టీఆర్‌ఎస్‌+ఎంఐఎం+స్వతంత్రులు కలిపి)

  • కాంగ్రెస్‌ 142
  • బీజేపీ 85
  • బీజేపీ, కాంగ్రెస్‌ 
  • సంఖ్యాబలం అరకొరే
  • కల్వకుంట్ల కవిత గెలుపు ఇక లాంఛనమే
  • స్పష్టం చేస్తున్న ఓటర్ల సంఖ్యాబలం
  • టీఆర్‌ఎస్‌కే మద్దతు అంటున్న ఎంఐఎం
  • అధికారపక్షం గూటికి స్వతంత్రులు...

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీల వారీగా ఓటర్ల సంఖ్యా బలాన్ని పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఆమె ఎన్నిక లాంఛనప్రాయమే కానుంది. ఉభయ జిల్లాల్లో అన్ని స్థానిక సంస్థల్లో కలిపి 824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో టీఆర్‌ఎస్‌ బలం 503 ఉండగా.. ఆ పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎంకు 28 మంది ఓటర్ల సంఖ్యాబలం ఉంది. వీరు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు. వీరితో పాటు 66 మందిగా ఉన్న స్వతంత్ర ఓటర్లు సైతం కవిత గెలుపు కోసం తాము టీఆర్‌ఎస్‌ వైపేనని ఇప్పటికే స్పష్టంచేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ సంఖ్యాబలం 597కి చేరింది.  73శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌ ఖాతాల్లో పడనున్నాయనే విషయం ఇప్పటికే తేటతెల్లమైంది. కాంగ్రెస్‌కు 142 ఓటర్ల సంఖ్యాబలం ఉండగా.. బీజేపీకి 85 ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు పరాభవం తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని మాజీ ఎంపీ కవిత అఖండ మెజార్టీతో కైవసం చేసుకోవడం లాంఛనప్రాయమే కానుంది. పార్టీల వారీగా సంఖ్యా బలాన్ని పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఉభయ జిల్లాల్లోని అన్ని స్థానిక సంస్థల్లో కలిపి 824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో టీఆర్‌ఎస్‌ బలం 504 ఉండగా.. మిత్రపక్షమైన ఎంఐఎంకు  28 మంది ఓటర్ల సంఖ్యా బలం ఉంది. వీరు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపుతారు. వీటితో పాటు 66 మంది ఉన్న స్వతంత్ర ఓటర్లు సైతం కవిత గెలుపు కోసం తాము టీఆర్‌ఎస్‌ వైపేనని స్పష్టం చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ సంఖ్యా బలం 597కి చేరింది. దీంతో 73శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌ ఖాతాల్లో పడనున్నాయనే విషయం ఇప్పటికే తేటతెల్లమైంది. కాగా, టీఆర్‌ఎస్‌ అఖండ మెజార్టీ సొంతం చేసుకోనుందనే విషయం అందరికీ అవగతమైంది. కవిత బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకోవడం లాంఛనమే కానుంది. కాంగ్రెస్‌కు 142 ఓటర్ల సంఖ్యాబలం ఉండగా.. బీజేపీకి 85 ఓటర్ల సంఖ్యాబలం ్లమాత్రమే ఉంది. ఈ రెండు పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు సైతం కొందరు అభివృద్ధిని ఆశించి కవితకు మద్దతుగా నిలవాలని తెలుస్తున్నది. ఇది టీఆర్‌ఎస్‌కు అదనపు బలంగా చెప్పవచ్చు. దీంతో ప్రస్తుతం ఉన్న 597 ఓటర్ల సంఖ్యాబలంతో పాటు కాంగ్రెస్‌, బీజేపీల ఓటర్లు సైతం కవిత గెలుపు కోసం టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే.. ఓట్లు మరింత పెరిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే విషయాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పార్టీలకతీతంగా కవిత గెలుపును కోరుకుంటున్నారని, 824 మంది ఉన్న ఓటర్ల సంఖ్యాబలంలో 700 ఓట్ల వరకు కవితకు పడే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. అరకొర సంఖ్యా బలంతో బరిలోకి దిగిన కాంగ్రెస్‌, బీజేపీలు.. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం పాట్లు పడుతున్నాయని ఆరోపించారు. కవిత గెలుపు కామారెడ్డి, నిజామాబాద్‌ ఉభయ జిల్లాల అభివృద్ధికి ఎంతో అవసరమని పార్టీలకతీతంగా ఓటర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు పరాభావం తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


logo