గురువారం 04 జూన్ 2020
Nizamabad - Mar 19, 2020 , 04:17:28

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

  • చివరి రోజు ఇద్దరు డిబార్‌
  • హాస్టళ్లు ఖాళీ..
  • ఇంటిబాట పట్టిన విద్యార్థులు

ఇందూరు/ నిజామాబాద్‌ అర్బన్‌: ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారం ముగిశాయి. ఉదయం కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతుండగా డిబార్‌ చేశామని డీ ఐఈవో దాసరి ఒడ్డెన్న తెలిపారు. పరీక్షలకు మొత్తం 19,329 మందికి  గాను 15,167 మంది హాజరు కాగా 1,062 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. నిజామాబాద్‌ ప్రభుత్వ బాలికల కళాశాల లో హరికృష్ణారెడ్డి, గంగసుమన్‌ మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా వారిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులు న మోదు చేశామని డీఐఈవో తెలిపారు. పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. రెండు వారాలుగా ఇంటర్మీడియెట్‌ పరీక్షలు రాస్తున్న ద్వితీయ సంవత్సర విద్యార్థులకు బుధవారం చివరి పరీక్ష కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హా స్టల్‌లో ఉన్న తమ పిల్లలను తీసుకెళ్లేందుకు నగరానికి చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి బస్టాండ్‌ ప్రాంగణం విద్యార్థులు, తల్లిదండ్రులతో కళకళలాడింది.


logo