శనివారం 06 జూన్ 2020
Nizamabad - Mar 19, 2020 , 04:13:58

చౌట్‌పల్లి నుంచి పెద్దల సభకు..

చౌట్‌పల్లి నుంచి పెద్దల సభకు..

  • రాజ్యసభ సభ్యుడిగా కేఆర్‌ సురేశ్‌రెడ్డి ఏకగ్రీవం
  • టీఆర్‌ఎస్‌లో హర్షాతిరేకాలు
  • చౌట్‌పల్లి నుంచి పెద్దల సభ దాకా..

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ: చౌట్‌పల్లి నుంచి ఢిల్లీలోని పెద్దల సభ  దాకా కేఆర్‌ సురేశ్‌రెడ్డి రాజకీయ పయనం సాగింది. జిల్లాలోని కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో యువజన నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వరుసగా నాలుగుసార్లు బాల్కొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా స్పీకర్‌గా పని చేశారు.తెలంగాణ రాష్ర్టాన్ని వే గంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరచడం ఎంతో అవసరమని పేర్కొంటూ, 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆనాడు సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ లో చేరిక ఆయన అనుచరుల్లో ఆనందాన్ని నింపింది. నేడు ఆయనకు  రాజ్యసభకు అవకాశం కల్పిండంతో కేసీఆర్‌కు కార్యకర్తలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆయన ఏకగ్రీవంగా నిలవడంతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడం లాంఛనమే. 


logo