శనివారం 30 మే 2020
Nizamabad - Mar 19, 2020 , 04:09:25

కరోనాపై పోరు

కరోనాపై పోరు

  • నేడు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన అత్యవసర భేటీ 
  • హాజరుకానున్న కలెక్టర్‌, సీపీ
  • జిల్లాలో పటిష్ట చర్యలు చేపడుతున్న యంత్రాంగం
  • జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్‌ అధికారుల తనిఖీలు
  • పలు సంతల మూసివేత
  • సరిహద్దుల్లో వైద్య సిబ్బంది తనిఖీలు

కరోనా వైరస్‌ పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమీక్షకు కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయశర్మ హాజరుకానున్నారు. మరోవైపు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా వైద్య సిబ్బంది అవగాహన  కార్యక్రమాలు ముమ్మరం చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలు ఆపి తనిఖీలు చేస్తున్నారు. బార్లు తెరచి ఉండకుండా ఎక్సైజ్‌ సిబ్బంది  చర్యలు చేపడుతున్నారు. పలు సంతలను రద్దుచేశారు. 

బోధన్‌ రూరల్‌ / రెంజల్‌ / కోటగిరి : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఆదిలోనే అణిచి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా వైద్యశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బోధన్‌ మండలంలోని సాలూర గ్రామ శివారులోని కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ తనిఖీ కేంద్రాన్ని బుధవారం వైద్యశాఖ అధికారులు ఏర్పా టు చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో కరోనా వైరస్‌ తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ నిర్ధ్దారణ కోసం మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీ కేంద్రంలో మెడి కల్‌ అధికారులు, వీఆర్వో, పోలీసు సిబ్బంది తదితరులు ఉండగా.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు.

కందకుర్తి శివారులో..

మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులో రెంజల్‌ మండలం కందకుర్తి శివారులో బుధవారం కరోనా వైరస్‌ చెక్‌ పాయింట్‌ను ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్‌ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ విద్య తెలిపారు. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దు కావడంతో కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున రెంజల్‌ మండ లం కందకుర్తి, బోధన్‌ మండలం సాలూర గ్రామ సరిహ ద్దులో ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్‌ శాఖల సమన్వయంతో చెక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు  తెలిపారు. రెంజల్‌కు చెందిన వ్యక్తి ఇటీవల దుబాయి నుంచి ఇంటికి చేరుకోగా.. ఎంపీడీవో గోపాలకృష్ణ, మండల వైద్యాధి కారిణి క్రిస్టినా ఆ ఇంటినిసందర్శించారు. 

పొతంగల్‌లో కరోనా శిబిరాల చెక్‌పోస్టు ఏర్పాటు

సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా కరోనా శిబిరాల చెక్‌పోస్టును ఏర్పాటు చేశామని కోటగిరి మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌ విఠల్‌ తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పొతంగల్‌ చెక్‌పోస్టు వద్ద సర్వే చెక్‌పోస్టు ఏర్పాటు చేశామన్నారు. మంజీర అవతలి వైపున్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తలు చెబుతున్నామన్నారు. అంతకు ముందు కోటగిరి మండల కేంద్రంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ఇంటికి వెళ్లి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. logo