శనివారం 06 జూన్ 2020
Nizamabad - Mar 17, 2020 , 03:07:38

ముందుజాగ్రత్తే మందు

ముందుజాగ్రత్తే మందు
  • కరోనా కట్టడికి విస్తృత చర్యలు
  • ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల్లో కదలిక
  • జిల్లాకు చేరిన ఎన్‌ 95 మాస్కులు
  • జనసమ్మర్ద ప్రాంతాల్లో శుభ్రతా చర్యలు

ఖలీల్‌వాడి: కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం సాయంత్రం సంబంధిత శాఖల రాష్ట్రస్థాయి అధికారులు శాంతికుమారి, సత్యనారాయణ తదితరులతో కలిసి కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, పోలీసుశాఖ అధికారులు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాలతోపాటు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 4లో తెలిపిన అన్ని ఆదేశాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. పట్టణాల్లో ఈ విషయాలపై ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలపై ఇప్పటికే మంచి స్పందన వచ్చిందని, యాజమాన్యాలు సంస్థలను మూసి ఉంచాయని తెలిపారు. ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారీ చేసిన విధంగా ప్రతి ఒక్కరూ పాటించాలని, బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులు, వారు ఉండే హాస్టల్స్‌ మినహా మిగతావి అన్ని మూసివేయాలని ఆదేశించారు. ఈ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందే విధంగా వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. సభలు, సమావేశాలు, ఫంక్షన్లు, ఈవెంట్స్‌ అనుమతించొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆదివారం సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆదేశాలు జారీ చేశామని, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో బృందాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన 24 పడకల ఐసోలేషన్‌ వార్డులో పర్యటించి ఏర్పాట్లు పరిశీలించామని, సిబ్బంది కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, అన్ని విషయాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. వీసీలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, అడిషనల్‌ డీసీపీ రఘువీర్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి ఏసీపీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ నాగేశ్వర్‌రావు, డీఎంహెచ్‌వో సుదర్శనం, ఆర్డీవోలు, డీపీవో, డీసీవో పాల్గొన్నారు. 

జిల్లాకు చేరిన ఎన్‌ -95 మాస్కులు 

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే విద్యా సంస్థలతో పాటు ప్రధాన జనసమూహం ఉండే సంస్థలన్నింటినీ బంద్‌ చేయాలని, నెలాఖ రు వరకు దీనిని కొనసాగించాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్ర ప్రభు త్వ దవాఖానలో కరోనా వైరస్‌ వ్యాధి సోకినట్లు ఎవరికైనా అనుమానాలుంటే తగిన చికిత్సలు చే సేందుకు ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పా టు చేశారు. కావాల్సిన వైద్య సిబ్బందిని కూడా నియమించారు. మరోవైపు బహిరంగ మా ర్కెట్లో మాస్కులను అధిక ధరలకు అమ్మే మెడికల్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు ని ర్వహించి ఉక్కుపాదం మోపుతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎన్‌ -95 మాస్కులను జిల్లాకు పం పింది. దాదాపు 500 మాస్కులు సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌కు చేరాయి. కరోనా వ్యాధి సోకినట్లు అనుమానం రాగానే ఐసోలేషన్‌ వార్డులో చికిత్స ప్రా రంభించే క్రమంలో రోగితో పాటు పర్యవేక్షిస్తున్న డాక్టర్‌కి ఈ మాస్కులు వాడతారు. హైరిస్క్‌ కండీషన్‌లో సైతం వైరస్‌ బారి నుంచి పేషంట్‌ను, వైద్యున్ని సంరక్షించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన ఎన్‌ -95 మాస్కులు ఎంతో ఉపయోగపడతాయి. ముందు జాగ్రత్త చర్యగా జిల్లాకు ప్రభుత్వం ఈ మాస్కుల ను పంపింది. జిల్లా కేంద్ర దవాఖానలో వైద్యులు వాడేందుకు ఇప్పటి కే 150 ఎన్‌ -95 మాస్కులను సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌ విభాగం పంపిణీ చేసింది. మిగతావి స్టోర్‌లోనే భద్రపరిచింది. అవసరం రీత్యా వీటిని వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉంచుకున్నది. కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వాడేందుకు అవసరయ్యే పదిహేను రకాల మందులు సైతం అన్ని పీహెచ్‌సీలలో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. 

కరోనా ప్రభావం నివారణకు చర్యలు

నిజామాబాద్‌ సిటీ :  ఇందూరు నగరం బోసిపోయింది. ప్రతి సోమవారం జనంతో సందడిగా కనిపించే వీధులన్నీ కరోనా ప్రభావంతో నిర్మానుష్యం గా దర్శనమిచ్చాయి. నగరంలో ప్రధాన ప్రాంతా ల్లో ఉన్న మాల్స్‌, సినిమా హాళ్లు, బార్లు దాదాపు మూతబడ్డాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు ప్రజలు సహకరిస్తున్నారు. సందర్శకులతో కిటకిటలాడే సినిమా థియేటర్లు, పార్కులు, బార్లు మూసివేయడంతో ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు మాస్కులు ధరిస్తున్నారు. నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలోని అన్ని బస్టాండ్లలో ప్రత్యేకంగా శుభ్రం చేస్తున్నారు. నగర ప్రజ లు మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు.  

అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం

కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభు త్వం ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది. రోజూ కలెక్టర్‌ పర్యవేక్షణల్లో ఆయా మున్సిపల్‌ క మిషనర్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖ అధికారులతో కరోనా నివారణపై సమీ క్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలు శుభ్రత పాటించాలని, ఆరోగ్య శాఖ జారీ చేసిన జాగ్రత్తలు పాటించాలని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పీహెచ్‌సీల్లో కరో నా నివారణ చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 31 వరకు వివాహాల కోసం ఫంక్షన్‌హాళ్లు బుక్‌ చేసుకోవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు.  ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.logo