మంగళవారం 26 మే 2020
Nizamabad - Mar 17, 2020 , 02:57:38

‘నరక’దారికి విముక్తి

‘నరక’దారికి విముక్తి

వేగంగా కొనసాగుతున్నాయి. ప్రఖ్యాత సరస్వతీ మాత దేవాలయం నిర్మల్‌ జిల్లా బాసరలో ఉండడంతో నిత్యం వేలాది మంది ఈ రహదారి గుండా వెళ్తుంటారు. దీంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ రహదారిని వెడల్పు చేయాలని భావించింది. రూ.50 కోట్ల వ్యయంతో 14.4 కి.మీ మేర నాలుగు లేన్ల రోడ్డును విస్తరించేందుకు సరళ కంపెనీకి పనుల్ని అప్పగించింది. ఏవో సాకులు చెబుతూ కాంట్రాక్టర్‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో ప్రమాదకరంగా మారిన ఈ రోడ్డు పలు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కోర్టు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో ఒకానొక సందర్భంలో సదరు కాంట్రాక్టు కంపెనీని ప్రభుత్వం బ్లాక్‌ లిస్టులో పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రహదారి పనులు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం, మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పెండింగ్‌ పనులు మే నెలాఖరులోగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేయడంతో పనుల్లో వేగం పుంజుకుంది. కంకర, మొరం వేసే పనులతో పాటు బీటీ పనులు కొనసాగుతున్నాయి.

  • బాసర రోడ్డుకు మోక్షం
  • శరవేగంగా రహదారి నిర్మాణం
  • ప్రభుత్వ తక్షణ చర్యలతో పట్టాలెక్కినపెండింగ్‌ పనులు
  • రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించినమంత్రి
  • నాలుగేండ్లుగా ప్రయాణికులకు నరకం చూపుతున్న నిజామాబాద్‌-బాసర రహదారి విస్తరణ పనులు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : నిన్న టి వరకు నరకాన్ని తలపించిన బాసర రోడ్డు ఇక బాగుపడనున్నది. బాలారిష్టాలు దాటని ఈ పను లు నాలుగేండ్లుగా పెండింగ్‌లో పడ్డాయి. జనవరి 2017లో ఈ రహదారి పనులు ప్రారంభమయ్యా యి. ఉన్న రోడ్డును తవ్వేసి కొత్త రోడ్డు కోసం గుం తలు తవ్వి, కంకర పోసి భయంకరంగా తయారు చేసి వదిలేశారు కాంట్రాక్టర్లు. ఏవో సాకులు చె బుతూ ఏండ్లు గడిపారు. పనులు చేయాలని పలుమార్లు అల్టిమేటం జారీ చేసినా పెడచెవిన పెట్టా రు. అనుమతులు రద్దు చేయడంతో పాటు ఈ పనులు చేపట్టిన సరళ ప్రాజెక్టు లైసెన్సులు కూడా బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో కోర్టు మెట్లెక్కిన సదరు కంపెనీ మ రింతగా పనులను తాత్సారం చేసింది. దీంతో ఈ మార్గం గుండా నిత్యం వేలాదిగా నడిచే వాహనదారులకు నరకమే కనిపించేది. 

బాసర సన్నిధికి నిత్యం వేలాది మంది పయనం..

సరస్వతీమాత సందర్శన కోసం హైదరాబాద్‌, ఆంధ్ర తదితర ప్రాంతాల నుంచి బాసరకు వస్తుంటారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి మొక్కు లు తీర్చుకుంటారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తారు. బాసర సరస్వతీదేవి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ ఉం ది. చాలా మంది భక్తులు ఎంతో నమ్మకంతో, భక్తిభావంతో గుడికి వెళ్తుంటారు. హైదరాబాద్‌ మీదుగా బాసర వెళ్లేందుకు వయా నిజామాబాద్‌ మాత్రమే ఏకైక దారి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి బోధన్‌ రోడ్డు గుండా జాన్కంపేట్‌ వరకు వెళ్లి అక్కడి నుంచి కుడివైపున నవీపేట్‌ వెళ్లే దారి గుండా బాసర వెళ్లాల్సి ఉంటుంది. 

జాన్కంపేట నుంచి నరకమే..

నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి జాన్కంపేట్‌ వరకు రోడ్డు ఇబ్బందులు లేమీలేవు. జాన్కంపేట్‌ నుంచి బాసర వెళ్లేందుకు అప్పటి వరకు రెండులే న్ల దారి అధ్వానంగా మారి ఉండడంతో దీనిని వెడల్పు చేసి నాలుగులేన్ల రోడ్డుగా మార్చాలని ప్ర భుత్వం నిర్ణయించింది. నాలుగేండ్ల క్రితం ఈ కాంట్రాక్ట్‌ను సరళ ప్రాజెక్టు దక్కించుకున్నది. రూ.50 కోట్ల వ్యయంతో 14.4 కి.మీ మేర నా లుగు లేన్ల రోడ్డును వేసేందుకు పనులు చేపట్టింది. ఆరంభశూరత్వంగా చేపట్టిన ఈ పనులు ఆదిలోనే ఆగిపోయాయి. ఏవో సాకులు చెబుతూ కాంట్రాక్టర్‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దాదాపు 20 శాతం కూడా పనులు పూర్తి కాలేదు. ఇలా పనులను గాలికొదిలేయడంతో వాహనదారుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ప్రమాదకరంగా ఈ రోడ్డు మారి పలు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దుమ్మురేగుతూ క్షణక్షణం ప్ర యాణం ప్రాణగండంగా మారింది. దీంతో బాసరకు వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నరకయాతన ప డుతూ గమ్యస్థానాలకు చేరాల్సిన దుస్థితి ఉండేది. దీనిపై రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.  ఏజెన్సీ నిర్వాహకులతో ప్రత్యేకంగా మాట్లాడి డెడ్‌లైన్‌ విధించి పనులు ప్రారంబింపజేశారు. ఇప్పుడు పనులు మొదలై వేగం పుంజుకున్నాయి. మే చివరి నాటికి రోడ్డు పనులు పూర్తి కావాలని అల్టిమేటం జారీ చేయడంతో వడివడిగా పనులను సరళ ప్రాజెక్టు చేస్తున్నది. దీంతో నాలుగైదేండ్లుగా నరకయాతన చూపిన బాసర రోడ్డుకు ఇక మహర్దశ రానుంది. ప్రయాణం సాఫీగా సాగనుంది. నరకయాతన నుంచి విముక్తి కలగనుంది. 


logo