బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 14, 2020 , 12:01:58

ఘనంగా మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

ఖలీల్‌వాడి: జిల్లాకేంద్రంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ జాగృతి నాయకులు నీలకంఠేశ్వరాలయంలో శివలింగానికి అభిషేకం నిర్వహించారు. పార్వతి మాతకు  ఒడి బియ్యం పోశారు. 9.30 గంటలకు శ్రావ్యగార్డెన్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు అవంతిరావు ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేశారు. అనంతరం జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నుడా డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌లో సొసైటీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. స్నేహ సొసైటీలో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఆర్‌.రాంకిషన్‌రావు హాజరై కేక్‌కట్‌ చేసి పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. పాతగంజ్‌లో జాగృతి యూత్‌ అధ్యక్షుడు రెహన్‌ ఏర్పాటు చేసిన కూల్‌ వాటర్‌ ఫ్రీజ్‌ను జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు ప్రారంభించారు. తెలంగాణ మహిళా జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను నిర్వహించి మహిళలంతా కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అవంతిరావు మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవిత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను  ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారని కొనియాడారు. గల్ఫ్‌ బాధితులకు అండగా నిలుస్తున్నారని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు ఏర్పాటుచేసి విద్యార్థులకు చేయూతనిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ్‌, పంచరెడ్డి మురళి, రాజేశ్‌ యాదవ్‌, సాయికృష్ణ, రమేశ్‌రావు, హరీశ్‌యాదవ్‌, గోపాల్‌, అరుణ్‌, సంపత్‌, విక్కీ, అపర్ణ, పద్మ, వసంత, శోభ, రఘుపతి, నరాల సుధాకర్‌, దామోదర్‌, సాయి, సందీప్‌, అజాం, రవి, పోల హరిప్రసాద్‌, దండు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

నిజామాబాద్‌ యూత్‌ ఆధ్వర్యంలో... 

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ఆర్మూర్‌ మండలంలోని మామిడిపల్లిలో తపస్వీ తేజో నిలయం పాఠశాలలో విద్యార్థులచే కేక్‌కట్‌ చేసి ప్లేకార్డ్స్‌ను ప్రదర్శించారు. అనంతరం యూత్‌ సభ్యులు పబ్బాసాయి విద్యార్థులకు బుక్కులు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. 

తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో... 

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షురాలు బట్టు కౌసల్య ఆధ్వర్యంలో సంబురాలను నిర్వహించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఆర్‌ రాంకిషన్‌రావు హాజరై కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో గంగాధర్‌, పోశెట్టి, సాయన్న, సాయిబాబా, శాంత, తదితరులు పాల్గొన్నారు.

డీసీసీబీ కార్యాలయంలో కవిత జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాకేంద్రంలోని జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంక్‌  కార్యాలయంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌ అధ్యక్షులతో కలిసి  డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.  


logo