శనివారం 06 జూన్ 2020
Nizamabad - Mar 10, 2020 , 00:43:30

నిర్లక్ష్యంపై చర్యలు

నిర్లక్ష్యంపై చర్యలు

నిజామాబాద్‌ సిటీ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. అధికారులు ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభించిన పనులు నిర్ధేశించిన సమయానికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా పంచాయితీశాఖ అధికారిణి జయసుధ ఆదేశాలు జారీ చేస్తున్నారు.  కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రతి గ్రామాన్ని తనిఖీ చేసి కొనసాగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను సస్పెండ్‌ చేస్తూ సర్పంచులకు సైతం నోటీసులు జారీ చేస్తున్నారు. 

ఇద్దరు సర్పంచులకు నోటీసులు

పంచాయతీ కార్యక్రమాలను, గ్రామాభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సర్పంచులకు నోటీసులను జారీ చేశారు.ఇప్పటికే నవీపేట్‌ మండలం శివతాండలో  వైకుంఠధామాలు, కాంపోస్ట్‌ షెడ్‌ పనులు మొదలు పెట్టకపోవడం,  డిచ్‌పల్లి మండలంలో సర్పంచ్‌, గ్రామ పంచాయతీ, వెస్లీతాండ, నడిపల్లి తాండ, అమృతాపూర్‌, యానంపల్లి తాండ, బర్దీపూర్‌, గొల్లపల్లి, బీబీపూర్‌, నక్కలగుట్ట తాండ గ్రామాల్లో శ్మశానవాటికల పనులు మొదలు పెట్టకపోవడంలో పంచాయతీరాజ్‌ చట్టం నిబంధనల మేరకు సర్పంచులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా శుక్రవారం మరో ఇద్దరు సర్పంచ్‌లకు అధికారులు నోటీసులు జారీ చేసింది. ఎడపల్లి మండలం నెహ్రునగర్‌, వర్ని మండలం నెహ్రునగర్‌లో డంపింగ్‌యార్డు స్థలానికి సంబంధించి నిర్లక్ష్యం వహించడంతో సర్పంచులకు నోటీసులు  అందజేశారు. 


logo