బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 10, 2020 , 00:39:10

నెమ్లి సాయిబాబా ఆలయంలో ‘బుల్లెట్‌ సత్యం’ షూటింగ్‌

నెమ్లి సాయిబాబా ఆలయంలో ‘బుల్లెట్‌ సత్యం’ షూటింగ్‌

బీర్కూర్‌ (నస్రుల్లాబాద్‌) : మండలంలోని నెమ్లి సాయిబాబా ఆలయంలో సినిమా షూటింగ్‌ నిర్వహించారు. సాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో నిర్మాత పొత్తూరి పవిత్ర, దర్శకుడు మధు గోపు, జీఎల్‌. బాబు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్న ‘బుల్లెట్‌ సత్యం’ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ క్లాప్‌ కొట్టగా నస్రుల్లాబాద్‌ ఎంపీపీ పాల్ద్య విఠల్‌, జడ్పీటీసీ జన్నుబాయి స్విచ్‌ ఆన్‌ చేసి షూటింగ్‌ ప్రారంభించారు. మండలంలోని సంగెం గ్రామ నివాసి బాబు ఈ సినిమాకు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంపై ఉన్న ప్రేమతో సాయిబాబా ఆలయంలో సినిమా ప్రారంభించామన్నారు. నెమ్లి, బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్‌లో 20 రోజుల పాటు షూటింగ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. చిత్రంలో దేవరాజ్‌ ప్రధాన పాత్ర పోషించగా చలాకీ చంటి, వినోద్‌కుమార్‌, మీనాక్షివర్మ, మేనక ఠాగూర్‌, శివలీల తదితరులు నటిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్లు పెర్క శ్రీనివాస్‌, దివిటి శ్రీనివాస్‌ యాదవ్‌, తహసీల్దార్‌ ధన్వాల్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ కుమ్మరి నారాయణ, కిశోర్‌ యాదవ్‌ తదితరులుపాల్గొన్నారు.


logo