శనివారం 06 జూన్ 2020
Nizamabad - Mar 09, 2020 , 02:08:56

కొనసాగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

కొనసాగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌ సిటీ: మహిళలు అన్ని రంగా ల్లో ముందుండాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని   నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ శాఖ, షీటీం  ఆధ్వర్యంలో 2కే రన్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, పోలీసు కమిషనర్‌ కార్తికేయ హాజరై 2కె రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మహిళలకు ఫిజికల్‌, ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యమని అన్నారు. అనంతరం పోలీసు కమిషనర్‌ కార్తికేయ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు శాఖ ద్వారా 2కే రన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగర మేయర్‌ నీతూ కిరణ్‌ మాట్లాడుతూ.. గతంలో ఆడపిల్ల జన్మించిందంటే బ్రూణ హత్యలు చేసే పరిస్థితి ఎక్కువగా ఉండేదన్నారు. నేడు మహిళలు పురుషులతో సమానంగా జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా స్వేచ్ఛగా జీవితంలో ముందుకు సాగాలని అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్‌ అన్నారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. మహిళలకు వచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయని, వాటిని ధైర్యంగా అవకాశాలను ఉపయోగించుకొని ముందుకు వెళ్లాలని అప్పుడే జీవితంలో అనుకున్న మెట్టు ఎక్కగలుగుతారని అన్నారు. అనంతరం 2కే రన్‌లో గెలుపొందిన ముగ్గురు విద్యార్థినులకు పోలీస్‌ కమిషనర్‌, కలెక్టర్‌, మేయర్‌, అదనపు డీసీపీ బహుమతులను అందజేశారు.  కార్యక్రమంలో జాతీయ హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య, కలెక్టర్‌ సతిమణీ మనిషారెడ్డి,  నిజామాబాద్‌ ఇన్‌చార్జి ఏసీపీ ప్రభాకర్‌రావు, పోలీస్‌ యూనిట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సరళ, వైద్యులు జీవన్‌రావు, సంధ్యారాణి, కవితారెడ్డి, మృదుల, మల్లేశ్వరి, ద్వారకాదేవీ, సీఐలు, ఎస్సైలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


logo