గురువారం 28 మే 2020
Nizamabad - Mar 09, 2020 , 01:33:16

దూపల్లి విండో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఎప్పుడో?

దూపల్లి విండో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఎప్పుడో?

రెంజల్‌ : మండలంలోని దూపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి జరగాల్సిన  వైస్‌ చైర్మన్‌  ఎన్నిక వాయిదా పడి నెల రోజులు సమీపిస్తున్నా అధికారు లు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దూపల్లి సహకార సంఘం పరిధిలోని దూపల్లి, కళ్యాపూర్‌, కునేపల్లి, బాగేపల్లి, ఎడపల్లి మండలం పోచారం గ్రామాల్లో గత నెలలో డైరక్టర్ల కోసం ఎన్నికలు జరిగాయి. 13 టీసీలకు గాను 10 మంది ఏకగ్రీవంగా కాగా, ఫిబ్రవరి 16న దూపల్లి విండో చైర్మన్‌ పదవికి పోటీ లేకపోవడంతో భూమారెడ్డికి చైర్మన్‌గిరి ఏకగ్రీవమైంది. దీంతో చైర్మన్‌తోపాటు డైరక్టర్లు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి నియామక పత్రాన్ని అందజేశారు. అదే రోజున వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకోవాలన్న ఆదేశాలున్న నలుగురు పోటీలో ఉండడంతో రెండు రోజులు వాయిదా వేశారు. ఈ విషయాన్ని  స్థానిక కార్యదర్శి  ఉన్నతాధికారులకు నివేధించగా ఆలస్యం కావడంతో వైస్‌ చైర్మన్‌గిరి పెండింగ్‌లో పడిందన్న చర్చ జరుగుతున్నది. డీసీసీబీ, అన్ని సహకార సంఘాల పాలకవర్గాలు కొలువు దీరినా రెంజల్‌ మండలం దూపల్లి సహకార సంఘం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నెల రోజులు సమీపిస్తున్నా  దూపల్లి సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ ఎన్నికను అధికారులు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  


logo