శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Mar 07, 2020 , 01:44:47

రెవెన్యూ సమస్యలు వేగంగా పరిష్కరించాలి

రెవెన్యూ సమస్యలు  వేగంగా పరిష్కరించాలి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : రెవెన్యూ అధికారులు శాఖా పరిధిలో సమస్యలను వేగంగా పరిష్కరించాలని, పెండింగ్‌ పనుల పూర్తిపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలపై ఆయన సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులకు శాఖాపరమైన విధులతో పాటు అవసరాన్ని బట్టి ఇతర శాఖల పనులను అప్పగిస్తున్నామని, అయినప్పటికీ అప్పగించిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తున్నారని ప్రశంసించారు. పల్లె ప్రగతిలో శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులకు నిర్మాణానికి స్థలాలను అప్పగించడంలో పూర్తిగా కృతకృతులయ్యారని, అందుకు అభినందనలు చెబుతున్నానన్నారు. జిల్లా లో ఆర్డీవోలు, తహసీల్లార్లతో కూడిన మంచి బృందాలు ఉన్నాయని, మంచి ఫలితాలు కూడా రావాలని సూ చించా రు. ఇతర పనులు అప్పగించినప్పటికీ, శాఖాపరమైన విధులు మాత్రం నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైందని, ఎల్‌ఆర్‌యూపీ, భూ వివాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయని, చాలా రికార్డులు అప్‌డేట్‌ అయ్యాయని తెలిపారు.జ అధికారులు చాలా కష్టపడ్డారని, కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కానీ, పాజిటీవ్‌ కంటే నెగిటీవ్‌కే బాగా ప్రచారం వచ్చిందని, దీనిని దూరం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు కృషిచేయాలని అన్నారు. 

రెవెన్యూ సమస్యలు పెండింగ్‌ ఉండొద్దు... 

రెవెన్యూ సమస్యలు పెండింగ్‌ లేకుండా చూడాలని, ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారంలో వీఆర్వోలతో ఖాతా నుంచి ఖాతా వరకు సమీక్షించాలని, కోర్టు కేసులు మినహా అన్ని సమపస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సాగుచేసే ప్రతి రైతుకు పాస్‌ పుస్తకం ఇవ్వాలన్నారు. వీఆర్వోలు ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందించాలన్నారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌పై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తేనే ఒక క్లారిటీ వస్తుందన్నారు. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు తదితర ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. ఫిర్యాదులకు అవకాశం ఇవ్వవద్దన్నారు. మండలాల్లో తహసీల్లార్లకు మంచి గౌరవం ఉంటుందని, అది ఇంకా పెరిగే విధంగా పని చేయాలని సూచించారు. ఫైల్స్‌ ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తూ ఉండాలని పెండింగ్‌లో ఉంచుకోవద్దన్నారు.


logo