బుధవారం 27 మే 2020
Nizamabad - Mar 07, 2020 , 01:42:34

కాళోజీ సినిమా షూటింగ్‌ ప్రారంభం

కాళోజీ సినిమా షూటింగ్‌ ప్రారంభం

ఇందూరు: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న కాళోజీ బయోపిక్‌ను ప్రముఖ నవలా రచయిత, నంది అవార్డు గ్రహీత డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ విజయ్‌ హై స్కూల్‌లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాకర్‌ జైనీ మాట్లాడుతూ.. తెలుగు భాషలో పద్మవిభూషణ్‌ పురస్కారం పొందిన ఏకైక కవి కాళోజీ నారాయణ రావు అని అన్నారు. బయోపిక్‌ షూటింగులో, పద్మవిభూషణ్‌ అవార్డు ఇవ్వడానికి ముందుకు కలెక్టర్‌ కార్యాలయంలో, ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావుతో జరిపిన సంభాషలను షూట్‌ చేశామని తెలిపారు. షూటింగ్‌లో కాళోజీ పాత్రలో మూలవిరాట్‌, కాళోజీ భార్యపాత్రలో విజయలక్ష్మి జైనీ, పీపీ మనోహర్‌రావు, తుమ్మూరి రామ్మోహన్‌రావు, చెల్లి స్వప్న, మల్లేశ్‌, సినిమా ఫేమ్‌ పద్మారెడ్డి నటిస్తున్నారని తెలిపారు. షూటింగ్‌ గురించి తెలుసుకున్న సినీప్రియులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మామిడిపల్లి గ్రామ శివారులో ఉన్న అపురూప వేంకటేశ్వరాలయంలో విద్యార్థులతో, వివిధ నటులతో వివిధ సన్నివేశాలను చిత్రీకరిస్తామన్నారు. షూ టింగ్‌ కోసం గోరేటి వెంకన్న కూడా ఇతర నటీనటులు వస్తున్నారని తెలిపారు. ఈ సినిమాలో ఇందూరు జిల్లా కళాకారులకు అవకాశం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


logo