శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Mar 07, 2020 , 01:36:18

న్యాయవ్యవస్థలో మహిళల సేవలు ప్రశంసనీయం

న్యాయవ్యవస్థలో మహిళల సేవలు ప్రశంసనీయం

నిజామాబాద్‌ లీగల్‌ : న్యాయవ్యవస్థలో మహిళలు ఎక్కువగా న్యాయమూర్తులుగా ఎంపిక కావడం శుభపరిణామని  ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి శ్రీసుధ అన్నారు. నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో సమ భాగంగా ఉన్న మహిళలకు సమాన అవకాశాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. బార్‌ అధ్యక్షుడు ఆకుల రమేశ్‌ మాట్లాడుతూ.. గృహిణి నుంచి మొదలువుతున్న మహిళ జీవితం అన్ని రంగాల్లో విస్తరించి ఆధునిక సమాజానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నదని అన్నారు. అదనపు జిల్లా జడ్జి రత్నాపద్మావతి మాట్లాడుతూ.. స్త్రీ, పురుష తేడా లేకుండా సమాన అవకాశాలు కలిగి ఉండాలని, ఆర్థికంగా మహిళలు ఎదగాలన్నారు. అదనపు జిల్లా జడ్జిలు గౌతంప్రసాద్‌, నర్సిరెడ్డి మహిళా దినోత్స ప్రాధాన్యతను వివరించారు. జిల్లా జడ్జి పద్మావతి, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు కళార్చన, ఉమ మహేశ్వరి, చందనలను శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. కార్యక్రమంలో బార్‌ ప్రధాన కార్యదర్శి పరుచూరి శ్రీధర్‌, కార్యదర్శి మానిక్‌రాజ్‌, పీపీ మధుసూదన్‌రావు, మహిళా న్యాయవాదులు కవిత, అజిత, కల్పన, మిథుల్‌ కుమారి, ప్రవీణ, షెహనాజ్‌ అరా, నూర్జహాన్‌ బేగం, వరలక్ష్మి, అంకిత పాల్గొన్నారు. 

జీజీ కళాశాలలో..

ఇందూరు : నగరంలోని గిరిరాజ్‌ కళాశాలలో ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్‌ (మహిళా సాధికారిత) విభాగం ఆధ్వర్యం లో అంతర్జాతీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని క ళాశాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ అధ్యక్ష త వహించారు. ఉదయం విద్యార్థులు, అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు స్ట్రీట్‌ ప్లే ఆన్‌ ఉమెన్‌ సేఫ్టీ పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సఖీ కేంద్రం లీగల్‌ కౌన్సిలర్‌ లావణ్య, సోషల్‌ కౌన్సిలర్‌ స్వరూప మహిళల సమస్యలు, వారి ఆరోగ్యం, సామాజిక కుటుంబ సమస్యలకు పరిష్కారం గురించి వివరించారు. డబ్ల్యూఈసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళా సమానత్వం అనే అంశంపై చర్చ నిర్వహించారు.  వైస్‌ ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, డాక్టర్‌ హేమలత, డాక్టర్‌ పి.లత, సుమలత, అనసూయ, డాక్టర్‌ రఫియా, వజీర, ప్రతిభ, లావణ్య, సురేశ్‌, ప్రార్థన, చంద్రిక, సంగీత, స్రవంతి పాల్గొన్నారు. 

మహిళలకు సన్మానం 

ఖలీల్‌వాడి : జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు మహిళలను సన్మానించారు. షీ టీం నుంచి రేఖారాణి, ఠాకూర్‌, హరితరాణి, సిద్ధార్థ కళా క్షేత్రం నిర్వాహకురాలు జయలక్ష్మి, ప్రెసిడెన్సీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ను సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్‌ పద్మజా సురేశ్‌, కొండ పవిత్ర, బిక్కుమల్ల స్వరూపరాణి, సౌభాగ్యలక్ష్మి, జ్యోతిలక్ష్మి, రమారాణి, పుష్ప, ధనలక్ష్మి, రాజమణి, రజిని, వనజ, యమున, మమత, జయలక్ష్మి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. 


logo