శనివారం 06 జూన్ 2020
Nizamabad - Mar 07, 2020 , 01:36:24

‘యూ- డైస్‌' పూర్తి చేయాలి

‘యూ- డైస్‌' పూర్తి చేయాలి

ఇందూరు : పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యూ-డైస్‌ని పూర్తి చేయాలని సెక్టోరల్‌ ఆఫీసర్‌ వినోద్‌రావు తెలిపారు. జిల్లా యూ- డైస్‌ 2019-20 ప్లస్‌ 2 కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాల ఎంఈవోలు, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్లతో శిక్షణ కార్యక్రమాన్ని నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. విద్యార్థుల వివరాల నమోదు, బోధన అంశాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమాచారం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, భవనాలు, టాయిలెట్స్‌, ల్యాబ్‌, క్రీడలకు సంబంధించిన వివరాల నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతుందన్నారు. పాఠశాలల్లో ఫిజికల్‌ ఫెసిలిటీస్‌ కల్పించాలనే ఉద్దేశంతో అన్ని వివరాలను ఆఫ్‌ లైన్‌ ద్వారా తీసుకొని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని చెప్పారు. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యూ డైస్‌ని పూర్తి చేసి కాంప్లెక్స్‌ హెచ్‌ఎంకి అందించాలని, ఆ తర్వాత కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు తప్పులు సవరించి ఎంఈవో కార్యాలయంలో అందజేస్తారని తెలిపారు. శిక్షణ తీసుకున్న వారు మండల స్థాయిలో విద్యావనరుల కార్యాలయంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 12 వరకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. శిక్షణలో 120 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీవో అస్రఫ్‌ అలీ, కో-ఆర్టినేటర్లు పద్మనాభం, రాంప్రసాద్‌, డీఎల్‌ఎంటీ ప్రసాద్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగజ్యోతి పాల్గొన్నారు. 


logo