మంగళవారం 26 మే 2020
Nizamabad - Mar 06, 2020 , 02:08:50

కరోనా అలర్ట్‌..

 కరోనా  అలర్ట్‌..

ఖలీల్‌వాడి: చైనా దేశంలో కరోనా వైరస్‌ ప్ర భావంతో వేలాది మంది మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ దేశంలో ఈ వైరస్‌ బారిన పడి పలువురు చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్‌ ప్రభావం ఆ దేశంలోనే కాకుండా దాని చుట్టుపక్కల దేశాల్లోనూ కనిపిస్తున్నది. మనదేశంలో కరోనా కేసు కేరళలో నమోదైనట్లు సమాచారం. ఇటీవల దుబాయ్‌ నుంచి ఇండియాకు వచ్చిన వారిలో పలువురికి కరోనా వైరస్‌ ప్రబలిం దన్న వదంతులు రావడంతో రాష్ట్ర వైద్యాశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాల ప్రకారం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో కరోనా వైరస్‌కు సంబంధించిన కమిటీని గత నెల 6న ఏర్పాటు చేశారు. దవాఖాన వెనుక భాగంలో కరోనా వైరస్‌కు సంబంధించిన ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. 

దానిలో 20 పడకలను ఏర్పా టు చేశారు. మొత్తం ఐదుగురు డాక్టర్లు, పదిహేను మంది సిబ్బందితో పకడ్బందీగా వార్డును ముందస్తుగా ఏర్పాటు చేశారు. వ్యాధికి సంబంధించిన ఓపీ, స్క్రీనింగ్‌ టెస్ట్‌, కౌన్సెలింగ్‌ రూమ్‌లను సిద్ధం చేశారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ దవాఖానలో ప్రతి రెండు గంటలకోసారి దవాఖాన మొత్తం శుభ్రపరుస్తూ స్ప్రే చల్లుతున్నారు. ఎప్పటికప్పుడు దవాఖానకు వచ్చే రోగులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా పరిశుభ్రత పాటిస్తున్నారు. ఐసోలేషన్‌ వార్డులో డాక్టర్లు ఉదయ్‌కిరణ్‌, సుభాష్‌కుమార్‌, గోపాల్‌సింగ్‌, కిరణ్‌కుమార్‌, అరుణ్‌ సుం దర్‌, దినేశ్‌ కుమార్‌లను నియమించారు. వార్డు కు సంబంధించి ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వార్డు స్థితిగతులను చూసుకునేందుకు పావని, సాయంత్రం సమయంలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8గంటల వరకు షాబానా ప్రవీణ్‌, రాత్రి సమయంలో 8 నుంచి ఉదయం 8గంటల వరకు సుధీర్‌ను నియమించారు. 

వైరస్‌ లక్షణాలు..
అన్ని శ్వాసకోస వైరస్‌లాగానే కొవిడ్‌ -19 సోకిన వారికి ఫ్లూ లక్షణాలే ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరం, గొంతులో గరగర, ఆయాసం, చిన్న పిల్లల్లోనైతే చెవి నొప్పి కూడా రావొచ్చు. జబ్బు మితిమిరితే నిమోనియా, సీవియర్‌ అక్యూట్‌, రెస్పిరేటర్‌ సిండ్రోమ్‌, మిగిలిన అవయవాలు చెడిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. 
దగ్గినా, తుమ్మినా ప్రమాదమే.. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ వైరస్‌లు డ్రాప్లెట్స్‌ రూపంలో గాల్లోకి చుట్టుపక్కల ప్రాంతాల్లోకి చేరుతాయి. గాలిని పీల్చడం, షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం, చుట్టుపక్కల ప్రాంతాలను ముట్టుకొని చేతులను నోట్లో, ముక్కులో, కంటిలో పెట్టుకోవడంతో ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంతుదుంది. ఈ క్రమంలో దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటి వారిపై తుంపర్లు పడకుండా చెయ్యి కానీ, రుమా లు, టిష్యూ పేపరు నోటికి అడ్డుపెట్టుకోవాలి. చేతులను శుభ్రంగా సబ్బుతో కడగాలి. చేతి రు మాలను వేరే వారిది వాడకూడదు. 

భయపడొద్దు..
పైన చెప్పిన లక్షణాలున్న వారందరూ కరోనా వైరస్‌ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే చైనాకు వెళ్లివచ్చారో వాళ్లు కానీ, ఎవరైతే కొవిడ్‌ - 19 జబ్బుతో బాధపడుతున్న వారి దగ్గరకి పద్నాల్గు రోజుల్లో కలిశారో వారిలో నే ఈ వైరస్‌ నిర్ధారణ చేసుకొనే అవకాశం ఉంది. ఇది ఆర్టిపీసీఆర్‌ అనే పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. 
పరిశుభ్రతే అసలు చికిత్స..ప్రస్తుతానికి దీనికి నిర్ధిష్టమైన చికిత్స లేకపోవడంతో మనకు మనమే రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నిరంతరం పరిశుభ్రత పాటించి చేతులను పదిహేను నిమిషాలకోసారి శుభ్రం చేసుకుంటే ఈ వ్యాధి బారినపడకుండా ఉంటాం. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.


logo