శనివారం 06 జూన్ 2020
Nizamabad - Mar 04, 2020 , 05:05:32

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
  • జిల్లాలో 45 సెంటర్ల ఏర్పాటు .. పరీక్ష రాయనున్న 38,666 విద్యార్థులు

ఇందూరు: 2019-20 విద్యా సంవత్సరం ఇంటర్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఐఈవో దాసరి ఒడ్డెన్న మంగళవారం తెలిపారు. ఈనెల 4 నుంచి 23వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు 45 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం విద్యార్థులు 38,666 మంది ఈ పరీక్షల కు హాజరవుతారని తెలిపా రు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 19,337 కాగా.. రెండో సంవత్సరం రెగ్యులర్‌ విద్యార్థులు 17,360, ప్రైవేట్‌ (సప్లిమెంటరీ) 1,939 మంది, మొత్తం 19,329 మంది ఉన్నా రు.  జనరల్‌ విద్యార్థులు 34,652 మంది కాగా, ఒకేషనల్‌ విద్యార్థులు 4,007 మంది హాజరవుతున్నారు. 


కాపీయింగ్‌కు పాల్పడితే మాల్‌ ప్రాక్ట్టీస్‌ కేసులు.. 

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెల్‌ఫోన్‌లు తీసుకురావద్దని సూచించారు. పరీక్షల్లో ఎలాం టి ఇతర పత్రాలు, కాగితాలు తీసుకురావద్దని, విద్యార్థులు ఎవరైనా మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, శివాజీ, గంగారాం, హైపవర్‌ కమిటీ సభ్యులు రఘురాజ్‌, ప్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు రెండు చంద్రవిఠల్‌, దేవరాం ఆధ్వర్యంలో రెవె న్యూ, పోలీసు, స్కాడ్‌ బృందాలు పరీక్షా కేంద్రాలు తనిఖీ చేస్తామని, ఆరుగురు సిట్టింగ్‌ స్కాడ్‌లు తనిఖీలు చేస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా కేందారల్లో సెల్‌ఫోన్‌ ఎవరు వినియోగించరాదని సూచించారు. 

పరీక్షా కేంద్రాల ఏర్పాట్ల తనిఖీ... 

మంగళవారం డీఐఈవో దాసరి ఒడ్డెన్న జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మూత్రశాలలు, విద్యుత్‌ సరఫరా, మెడికల్‌ బృందాల ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పించాలని చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్‌ సౌకర్యాన్ని కల్పిస్తుననట్లు తెలిపారు. మారుమూల గ్రామాలకు సైతం ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9గంటలకు తర్వాత విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని, విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 


పోలీసు స్టేషన్‌లలో ప్రశ్నాపత్రాలు... 

ఆయా పరీక్షా కేంద్రాల సమీపంలోని పోలీసుస్టేషన్‌లలో ప్రశ్నాపత్రాలను భద్రపరిచామని డీఐఈవో దాసరి ఒడ్డెన్న తెలిపారు. విద్యార్థులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ప్రశాంత వాతావరణంలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష రాయాలని సూచించారు. ఏ సమస్యలు ఉన్నా పరీక్షా కేంద్రాల్లో కౌన్సిలర్లు ఉంటారని, విద్యార్థులు వారిని సంప్రదించవచ్చని కోరారు. logo