ఆదివారం 31 మే 2020
Nizamabad - Mar 03, 2020 , 01:07:51

జాతీయ స్థాయికి ఎంపికైన జిల్లా క్రీడాకారుడు

జాతీయ స్థాయికి ఎంపికైన జిల్లా క్రీడాకారుడు

ఇందూరు: వెయిట్‌ లిప్టింగ్‌లో జాతీయ స్థాయికి జిల్లాకు చెందిన మహ్మద్‌ షాకీర్‌ అలీ ఎంపికయ్యాడు. ఆలిండియా సివిల్‌ సర్వీస్‌ స్పోర్ట్స్‌ ప్రతి సంవత్సరం  ఇండియా లెవల్‌లో ఒక్కో స్టేట్‌లో నిర్వహిస్తుంది.  కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ పోటీలను నిర్వహిస్తారు. వెయిట్‌ లిప్టింగ్‌ బెస్ట్‌ ఫిజిక్‌,  పవర్‌ లిప్టింగ్‌కు సంబంధించిన బీహార్‌లోని ఇండియా టోర్నమెంట్‌ ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు కొనసాగనున్నది. ఇది వరకే హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎంపికలను పూర్తి చేశారు. ఇందూరు జిల్లాకు చెందిన ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో టైపిస్టుగా పనిచేస్తున్న మహ్మద్‌ షాకీర్‌ అలీ 85 కిలోల బాడీ బిల్డింగ్‌లో రాష్ట్రస్థాయికి ఎంపికై జాతీయ స్థాయిలో పాల్గొనున్నాడు. 


logo