శనివారం 06 జూన్ 2020
Nizamabad - Mar 01, 2020 , 23:44:07

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

నిజామాబాద్‌ అర్బన్‌: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకొని కుటుం బ అభివృద్ధికి దోహదపడాలని కలెక్టర్‌ నా రాయణరె డ్డి అన్నారు. ఆదివారం న్యూ అంబేద్కరక్‌ భవన్‌లో డిస్ట్రిక్‌ లెవల్‌ యూ త్‌ కన్వెన్షన్‌, డిస్ట్రిక్‌ లెవల్‌ కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యం లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడా రు. యువతలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువత తన కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవడంతో పాటు సమాజంలో జరుగుతున్న విషయాలను తెలుసుకొని తనవంతు బాధ్యతలను గుర్తెరిగి నడుచుకోవాల్సి ఉంటుందని, అప్పుడే పరిపూర్ణత వస్తుందని తెలిపారు. మన చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ అందుకు తన పాత్ర ఏమిటో నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. భారతదేశంలో యువ సంపద ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉన్నదని దాన్ని గమనించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మన దేశంలో పర్యటించారని, ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయని అన్నారు. మన శక్తిని గమనించి మన యువతను వారి అభివృద్ధికి ఉపయోగించుకోవడానికి కూడా ముందు కు వస్తున్నాయని తెలిపారు. చదువును మార్కుల కోసమే కాకుండా మంచి పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పోటీతత్వాన్ని అధిగమించాలన్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడాల్సి ఉంటుందని సూచించారు. 

పరీక్షల విషయంలో ఆందోళన చెందొద్దు

ఈ రోజుల్లో పిల్లలు పరీక్షల కోసం భయపడుతున్నారని, ఒకసారి పరీక్ష తప్పినంత మాత్రానా జీవితం ముగిసిపోదనే విషయా న్ని వారికి చెప్పవలసి ఉంటుందని తెలిపా రు. విద్యార్థులు మానసిక ఆందోళనకు గురికాకుండా ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మ నందరిపై ఉన్నదని పేర్కొన్నారు. గతంలో పిల్లల కోసం ఆస్తిని అందించాలని చూసేవారని ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులు వారికి మంచి చదువు గురించి ఆలోచిస్తున్నారని, పిల్లలు కూడా సొంత తెలివితేటలతో స్థిరపడడానికి చదువుపై పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఏ రంగంలో స్థిరపడాలనుకున్నా దానికి అవసరమైన పరిశ్ర మ, సాధించాలనే దృడ సంకల్పం తప్పనిసరిగా ఉండాలన్నారు. వీటితో పాటు నిజాయితీ, విలువలు, నైతికత గురించి కూడా నేర్చుకోవాలన్నారు. స్మార్ట్‌ ఫోన్లను అవసరం వరకే ఉపయోగించుకోవాలని వాటి కి బానిసలు కావొద్దని యువతకు సూచించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన వారికి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో నెహ్రూ యు వ కేంద్ర సమన్వయకర్త బెల్లాల్‌ శైలి, యువత, యువ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


logo