సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Feb 28, 2020 , 00:09:35

ప్రతి విద్యార్థికీ ఇంటర్‌ టర్నింగ్‌ పాయింట్‌

ప్రతి విద్యార్థికీ ఇంటర్‌ టర్నింగ్‌ పాయింట్‌

బోధన్‌, నమస్తే తెలంగాణ : బోధన్‌ పట్టణంలోని విజేత జూనియర్‌ కళాశాల వార్షికోత్సవం ఆట, పాటలు, విద్యార్థుల కేరింతల మధ్య ఎంతో ఉల్లాసంగా జరిగింది. ఈ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మావతి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ఇంటర్మీడియెట్‌ ప్రతి విద్యార్థికీ టర్నింగ్‌ పాయిం ట్‌ అని అన్నారు. చదువుతోనే మనిషి గుర్తింపు వస్తుందని, ఒక మనిషి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే చదువుకోవడం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఇంటర్మీడియట్‌ చదువు ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైనదని అ న్నారు. కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు, కళాశాలకు పేరు తేవాలని విద్యార్థులను ఆమె కోరారు. 

ఇంటర్‌ టాపర్లకు నగదు బహుమతులు..

గత ఏడాది ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఎంపీసీ లో వెయ్యి మార్కులకుగానూ 984 మార్కులు సాధించిన టి.శరణ్య అనే విద్యార్థినికి పది వేల రూ పాయల నగదు బహుమతిని విజేత జూనియర్‌ కళాశాల డైరెక్టర్‌ వై.రమణారెడ్డి ప్రకటించారు. ఈ నగదు బహుమతిని శరణ్యకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మావతి అందించారు. అలాగే, వివిధ సబ్జెక్టుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు.. సుమారు రూ.50 వేల నగదు ప్రోత్సాహకాలను ఇచ్చారు. 

వార్షికోత్సవంలో విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృ త్యాలు, మోడ్రన్‌ డ్యాన్స్‌లు, వివిధ విన్యాసాలు విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో విజేత జూనియర్‌ కళాశాల డైరెక్టర్‌ వై.రమణారెడ్డితో పాటు ప్రిన్సిపాల్‌ ఎంవీ రమణారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి, శ్రీ సాయిప్రసన్న హైస్కూల్‌ డైరెక్టర్‌ జయప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo