శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 27, 2020 , 01:04:01

అర్బన్‌ పార్కులతో ఆహ్లాదం

అర్బన్‌ పార్కులతో ఆహ్లాదం

ఇందూరు: పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పట్టణాల్లో ఆహ్లాదకర వాతావరణం కోసం అడవులు దగ్గరగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా సారంగాపూర్‌ వద్ద అటవీ అర్బన్‌ పార్కును బుధవారం రాష్ట్ర రోడ్డు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లోల మాట్లాడుతూ.. అర్బన్‌ పార్కు ఏర్పాటుతో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి, పెద్దలు వాకింగ్‌ చేయడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. పట్టణాలకు దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతాల్లో అర్బన్‌ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఒక్కో అర్బన్‌ పార్కును సుమారు రూ. 3 నుంచి రూ. 5 కోట్లు వ్యయం చేస్తున్నామని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 92 పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. సారంగాపూర్‌ వద్ద   ఏర్పాటు చేసిన అర్బన్‌ పార్కులో 2.8 కి.మీ మేర వాకింగ్‌ ట్రాక్‌ సిద్ధం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో కూడా అర్బన్‌ పార్కులు ప్రజలకు చాలా ఉపయోగకరంగా, సౌకర్యంగా మారామని మంత్రి అల్లోల తెలిపారు. వీటి ద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించడంతో పాటు కాలుష్యం పెరగకుండా దోహదం చేస్తాయని తెలిపారు. హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకొని.. ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటామన్నారు. మరో రెండు మూడేండ్లలో తెలంగాణ వ్యాప్తంగా 33శాతం అడవుల విస్తీర్ణం పెరుగుతుందని, తద్వారా వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని, సకాలంలో వర్షాలు కురుస్తాయని, ఎండాకాలంలో వేడిమి తగ్గుతుందని ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. అర్బన్‌ పార్కులో అనుమతికి పెద్దలకు రూ. 10, పిల్లలకు రూ. 5 ఎంట్రీఫీ జు నిర్ణయించామని తెలిపారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, నిర్మల్‌లో ఏర్పా టు చేసిన అర్బన్‌ పార్కుకు పెద్ద ఎత్తున ప్రజలు పర్యటిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మం త్రులు, జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే, నగర మేయర్‌, ఎమ్మెల్సీ, కలెక్టర్‌ పార్కులో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ ఆ కుల లలిత, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, పీసీసీఎఫ్‌ శోభ, సీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌, డీఎఫ్‌వో సు నీల్‌, డిప్యూటీ మేయర్‌ ఇద్రీస్‌ఖాన్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఆర్డీవో వెంకటయ్య, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, అటవీశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


logo