ఆదివారం 31 మే 2020
Nizamabad - Feb 27, 2020 , 00:55:38

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌ అర్బన్‌: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు సేకరించడంతో పాటు విద్యుత్‌ బిల్లు చెల్లింపు, నర్సరీల్లో మొక్కలు పెంచడం, ఇతర పనులన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్లతో పల్లె ప్రగతి పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాక్టర్‌ కొనుగోలు, నర్సరీల్లో మొక్కలను త్వరగా విత్తడం, గ్రామ పంచాయతీల కరెంట్‌ బిల్లులు, పెండింగ్‌ లేకుండా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్‌ చార్జీల బిల్లులు పూర్తిగా చెల్లింపులు చేశామని, నర్సరీల్లో బ్యాగుల ఫిల్లింగ్‌ పూర్తయిందని, కన్వర్షన్‌ 26లక్షలకు గాను 24 లక్షలు  పూర్తి చేశామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్‌ లత, డీపీవో జయసుధ, జడ్పీ సీఈవో గోవింద్‌, డీఆర్డీవో అదనపు పీడీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo