శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 27, 2020 , 00:54:39

ఐక్యతతోనే వెలమ సంఘం అభివృద్ధి

ఐక్యతతోనే వెలమ సంఘం అభివృద్ధి

ఖలీల్‌వాడి : వెలమ సంఘం సభ్యులు ఐక్యతతో ఉన్నప్పు డే సంఘం అభివృద్ధి చెందుతుందని జడ్పీచైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మాజీ ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో వెలమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీచైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు హాజ రై మాట్లాడారు. వెలమ సంఘం ఎన్నికలు ఈనెల 23న నిర్వహించగా సంఘం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. ఈ కార్యవర్గం మూడేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రభు త్వం ద్వారా అన్ని విధాల సహాయ, సహకారాలు అందుతాయన్నారు. సంఘాభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు. జాతీయ స్థాయిలో వెలమ సంఘానికి మంచి గుర్తింపు ఉందని, జాతీయ కార్యవరంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు రాంకిషన్‌ రావు మాట్లాడుతూ.. వెలమ సంఘం నిర్వహించే కార్యక్రమాలకు తప్పకుండా ప్రతి ఒక్క సభ్యుడు హాజరుకావాలని పిలుపునిచ్చారు. 

అందరి సహాయ, సహకారంతోనే సంఘం అభివృద్ధి చెం దుతుందని తెలిపారు. సంఘ భవనానికి, కల్యాణ మం డపం నిర్మాణానికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేసిందన్నారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం నూతన కార్యవర్గ స భ్యులతో ప్రమాణ స్వీకారోత్సం చేయించారు. ముల్లంగి సర్పంచ్‌ పావణి శ్యాంరావు ముందుకు వచ్చి రూ. 25వేలు సంఘ కల్యాణ మండపానికి విరాళాన్ని అందజేశారు. ఆలిండియా వెలమ సంఘం సభ్యులు జలపతిరావు, నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఆర్‌ రాంకిషన్‌రావు, ఉపాధ్యక్షులు రమణ్‌రావు, మంజిత్‌రావు, గోదేవి, జాయింట్‌ సెక్రటరీలు కృష్ణమోహన్‌రావు, శ్రీనివాస్‌రావు, దయాకర్‌రావు, వాల సుమ, కోశాధికారి శ్రీనివాస్‌రావు, డైరెక్టర్లు కరుణాకర్‌రావు, వీరేందర్‌ రావు, మనోహర్‌రావు, కాంతారావు, మధుసూదన్‌రావు, నాగారావు, శ్రీనివాస్‌రావు, రాజేశ్వర్‌రావు, భగవత్‌ రావు, వెంకట్‌, వెంకటరమణ రావు, నాగేశ్వర్‌రావు, వెంకట్‌, సంజీవ్‌రావు, మనోజ్‌రావు, కాంతారావు, శమంత, హనుమంత్‌రావు, ప్రభాకర్‌రావు, వినాయక్‌రావులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు.logo