ఆదివారం 31 మే 2020
Nizamabad - Feb 27, 2020 , 00:54:39

పట్టణ ప్రగతి పనుల పరిశీలన

పట్టణ ప్రగతి పనుల పరిశీలన

భీమ్‌గల్‌ : పట్టణ ప్రగతి కార్యక్రమంతో వార్డుల్లో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని, పట్టణానికి కావాల్సి న మౌలిక వసతుల కల్పనకు మంచి అవకాశమని అడిషనల్‌ కలెక్టర్‌(స్థానిక సంస్థలు) శ్రీలత అన్నారు. భీమ్‌గల్‌ పట్టణంలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమా న్ని బుధవారం పరిశీలలించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ, మున్సిపల్‌ ప్రత్యేక అధికారి సింహాచలం తో కలిసి వార్డుల్లో జరుగుతున్న పనులను కాలినడకన వెళ్తూ పరిశీలించారు. చేపడుతున్న పనులపై సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా ఎదగాలని అన్నారు. మూడో వార్డులో 30 సంవత్సరాల నుంచి బహిరంగా మలవిసర్జన ప్రదేశాన్ని తొలగించడదతో వార్డు కౌన్సిలర్‌ లత, వార్డు ప్రత్యేక అధికారి హరీశ్‌ను అభినందించారు. నాలుగో వార్డులో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసి, ఇలాగే కొనసాగుతే అంగన్‌వాడీ కేంద్రానికి కావాల్సిన రేషన్‌ రద్దు చేస్తానని హెచ్చరించా రు. ఐదో వార్డులో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పదో తరగతిలో ఉత్తీర్ణత ఎలా ఉందని హెడ్‌మాస్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచాలని, డైనేజీల్లో చెత్త వేసిన వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. డంపింగ్‌ యార్డు స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌, వైస్‌చైర్మన్‌ గున్నాల బాల భగత్‌, కౌన్సిలర్లు మూత లత, బొదిరె నర్సయ్య, సిహెచ్‌. గంగాధర్‌, ఖైరున్నీసా బేగం, వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


logo