శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 26, 2020 , 01:00:46

సహకార ఎన్నికల్లో గులాబీదే జోరు

సహకార ఎన్నికల్లో గులాబీదే జోరు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: డీసీసీబీ, డీసీఎంఎస్‌లో అన్ని డైరెక్టర్‌ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం డైరెక్టర్‌ స్థానాల ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. డీసీసీబీలో కేటగిరీ(ఏ)లో పదహారు స్థానాలకు గాను ఎస్సీ అభ్యర్థి లేకపోవడంతో పదిహేను స్థానాలకు సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయి. కేటగిరీ(బీ) లోనూ నాలుగు స్థానాలకు నలుగురు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో డీసీసీబీలో ఎన్నిక జరిగిన మొత్తం 19 స్థానాలకు 19 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీఎంఎస్‌లో కేటగిరీ(ఏ)లో ఆరు స్థానాలుండగా.. ఆరు స్థానాలు సింగిల్‌ నామినేషన్లతో ఏకగ్రీవమయ్యాయి. కేటగిరీ(బీ)లో నాలుగు స్థానాలు ఉండగా.. 4 స్థానాల్లో సింగిల్‌ నామినేషన్లు రావడంతో ఏక్రగీవమయ్యాయి. డైరెక్టలందరూ టీఆర్‌ఎస్‌ బలపరిచిన వారే కావడంతో  డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరగడం లాంఛనమే. పార్టీ అధిష్ఠానం సూచించిన వారు చైర్మన్లుగా ఎన్నికకానున్నారు. 

కేటగిరీ (ఏ)లో డీసీసీబీ డైరెక్టర్లుగా ఎన్నికైంది వీరే..

కేటగిరీ ఓసీలో పోచారం భాస్కర్‌రెడ్డి, ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ముస్కుల సాయిరెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి (గిర్దావర్‌), జి.శరత్‌, మార గంగారెడ్డి, కాసల శ్రీనివాస్‌రెడ్డి, నాగంపేట శేఖర్‌రెడ్డి, కుంట రమేశ్‌ రెడ్డి, రమేశ్‌.

కేటగిరీ బీసీలో బూస శాంతేశ్వర్‌, బీ కృష్ణాగౌడ్‌, కేటగిరీ ఎస్టీలో సంగ్రాం, కేటగిరీ ఎస్సీలో పీ సాయన్న, గొడ్లే సిద్ధి రాములు. 

కేటగిరీ(బి)లో డీసీసీబీ డైరెక్టర్లుగా ఎన్నికైంది వీరే..

కేటగిరీ ఎస్సీలో జీ లింగయ్య, కేటగిరీ ఎస్టీలో డీ మోతీలాల్‌, కేటగిరీ బీసీలో ఎన్‌.శంకర్‌, కేటగిరీ ఓసీలో కె.ఆనంద్‌.

కేటగిరీ(ఏ)లో డీసీఎంఎస్‌ డైరెక్టర్లుగా ఎన్నికైంది వీరే.. 

పీ సాయన్న (పీఏసీఎస్‌ గాంధారి), బీ తారాచంద్‌ నాయక్‌ (పీఏసీఎస్‌ రాంపూర్‌), సంబారి మోహన్‌ (పీఏసీఎస్‌ నల్లవెల్లి), ఈ. శ్రీనివాస్‌ గౌడ్‌ (పీఏసీఎస్‌ అమ్రాద్‌), నల్లవెల్లి కపిల్‌రెడ్డి (పీఏసీఎస్‌ తాడ్వాయి), ఏదుల్లా ఇంద్రసేనారెడ్డి (పీఏసీఎస్‌ బీబీపేట్‌). 

కేటగిరీ(బి)లో డీసీఎంఎస్‌లో డైరెక్టర్లుగా ఎన్నికైంది వీరే..

ఎన్‌ రాజేశ్వర్‌ (అంబేద్కర్‌ ఎల్‌సీసీఎస్‌, కమలాపూర్‌), మదునల రాజాగౌడ్‌ (వెంకటేశ్వర సీహెచ్‌ఎస్‌, బోధన్‌), బీ గోపాల్‌ (బాలాజీఎస్టీ బంజారా ఎల్‌సీఎస్‌ఎస్‌, రాంపూర్‌), ఆర్‌ గంగారెడ్డి (అన్నపూర్ణ ఎల్‌ఐసీఎస్‌, నికాల్‌పూర్‌).


logo