శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 26, 2020 , 00:53:03

సామాజిక శాస్ర్తాలు దైనందిన జీవితానికి దోహదం

సామాజిక శాస్ర్తాలు దైనందిన జీవితానికి దోహదం

ఇందూరు: సామాజిక శాస్ర్తాలు దైనందిన జీవితంలో వచ్చే పరిస్థితులను ఎదుర్కొవడానికి దోహదపడతాయని టీఎస్‌సీహెచ్‌ఈ దోస్త్‌ కన్వీనర్‌, వైస్‌చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి అన్నారు. మంగళవారం గిరిరాజ్‌ కళాశాలలో ప్రభుత్వ పాలనశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ది ఫ్యూచర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, చాలెంజ్స్‌ అపార్చునిటీస్‌ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్‌ లింబాద్రి హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రస్తుత మార్పులకు అనుగుణంగా తమను తాము మలచుకోవాలని సూచించారు. ప్రొఫెసర్‌ పార్థసారథి మాట్లాడుతూ.. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ భవిష్యత్తులో ఎదుర్కొవాల్సిన చాలెంజ్స్‌, అవకాశాలపై విద్యార్థులకు వివరించారు. ప్రొఫెసర్‌ రవీందర్‌ కౌర్‌ మాట్లాడుతూ.. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఐసీటీ పాత్రను వివరించారు. అనంతరం పరిశోధనా విద్యార్థులు, అధ్యాపకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, కోకన్వీనర్‌ సుధాకర్‌, డాక్టర్‌ రామలింగం, ప్రొఫెసర్లు ప్రదీప్‌కుమార్‌, రాకేశ్‌ చంద్ర, లింగయ్య, డాక్టర్‌ అడెప్పా, వరప్రసాద్‌, ఎన్‌ జ్యోతి, రఫీక్‌, ముత్యంరెడ్డి, వివిధ విభాగాల ఇన్‌చార్జిలు, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


logo