గురువారం 28 మే 2020
Nizamabad - Feb 24, 2020 , 02:20:10

‘సహకారం’పై సమీక్ష

‘సహకారం’పై సమీక్ష

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల ఎన్నికపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉమ్మడి నిజామాబాద్‌ ఎమ్మెల్యేలతో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆశావహుల జాబితాపై సుదీర్ధంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డికి తెలియజేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేల ఏకాభిప్రాయం తీసుకున్న మంత్రి పార్టీ హైకమాండ్‌కు తుది నివేదికను సమర్పించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటింగ్‌ సరళిపై చర్చించారు. ఈ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ పాల్గొన్నారు. logo