గురువారం 28 మే 2020
Nizamabad - Feb 22, 2020 , 04:22:46

ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఆర్మూర్‌ మున్సిపల్‌ ఆర్మూర్‌, మాక్లూర్‌, నందిపేట్‌ మండలాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలను భక్తులు వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆర్మూర్‌ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన నవనాథ సిద్ధుల గుట్ట ఆలయానికి భక్తజనం పోటెత్తింది. ఆర్మూర్‌ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్ట శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ  ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని రాజారాం నగర్‌, పెర్కిట్‌, మామిడిపల్లి, జిరాయత్‌నగర్‌లోని స్వయంభు శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవనాథ సిద్ధుల గుట్టపై 16 కులాల సర్వసమాజ్‌ ఆధ్వర్యంలో భక్తులకు సేవలు అందించారు. 


మాక్లూర్‌ మండలంలోని గంగరమంద, మాక్లూర్‌, గొట్టుముక్కల, బోర్గాం(కె) గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గంగరమందలోని శ్రీలలితా త్రిపురసుందరి దేవి ఆలయంలో వద్ద ఏర్పాటు చేసిన శివలింగాలకు భక్తులు క్షీరాభిషేకం చేశారు. మాక్లూర్‌లోని బ్రహ్మంగారి ఆలయంలో బహ్మంగారికి కల్యాణం నిర్వహించారు. గొట్టుముక్కల,బోర్గాం(కె) గ్రామాల్లోని శివాలయాల్లో  భక్తులు శివునికి ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమం, నందికేశ్వర ఆలయం, మార్కండేయ మందిరం, బ్రహ్మంగారి మందిరం, ప్రధాన కూడలిలోని నంది విగ్రహం వద్ద, ఉమ్మెడ పాత గ్రామంలోని గోదావరి నది ఒడ్డున్న ఉన్న ఉమా మహేశ్వర ఆలయంలో, అయిలాపూర్‌లోని చంద్రమోళేశ్వరాలయం, పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమంలోని నవనాథ స్థూపం, సాయిబాబాబ మందిరం, పంచముఖి హనుమాన్‌, పలు ఆలయాల్లో భక్త జనం కిక్కిరిసిపోయింది. ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగి రాములు మహరాజ్‌ భక్తులకు నుదుట బొట్టుపెట్టి ఆశీర్వదించారు. 


కేదారేశ్వర ఆశ్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మంగి రాములు మహరాజ్‌ ఆశీస్సులు తీసుకున్నారు. ఆర్మూర్‌ ఏసీపీ రఘు, రూరల్‌ సీఐ విజయ్‌కుమార్‌, ఎస్సై రాఘవేందర్‌ దంపతులు కేదారేశ్వర ఆశ్రమంతో పాటు ఉమ్మెడ ఉమా మహేశ్వర ఆలయంలో పూజలు చేశారు. నందిపేట్‌ మండలం వెల్మల్‌లోని నగరేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నూత్‌పల్లిలోని రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కుద్వాన్‌పూర్‌, వన్నెల్‌(కె), సిద్ధ్దాపూర్‌, తొండాకూర్‌, దత్తాపూర్‌, మారంపల్లి, గంగాసముందర్‌, జీజీ నడ్కుడ, గాదేపల్లి, చిన్నయానం, అన్నారం, సిర్‌పూర్‌, డొంకేశ్వర్‌, నికాల్‌పూర్‌, శాపూర్‌, కోమట్‌పల్లి తదితర గ్రామాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. 

- నమస్తే తెలంగాణ యంత్రాంగం


logo