ఆదివారం 31 మే 2020
Nizamabad - Feb 22, 2020 , 03:24:22

హరహర మహాదేవ.. శంభో శంకర..

హరహర మహాదేవ.. శంభో శంకర..

నియోజకవర్గంలోని శివాలయాలు శుక్రవారం శివనామ స్వరణతో మార్మోగాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. బోధన్‌ పట్టణంలోని ప్రముఖ చక్రేశ్వరాలయంలో తెల్లవారు జామునుంచే భక్తులు పూజలు నిర్వహించారు.

  • శివ నామస్మరణతో మార్మోగిన శివాలయాలు
  • తెల్లవారు జామునుంచే ఆలయాల్లో పూజలు

బోధన్‌, నమస్తే తెలంగాణ/ శక్కర్‌నగర్‌/ బోధన్‌ రూరల్‌ / ఎడపల్లి / కోటగిరి/రుద్రూర్‌/చందూర్‌: నియోజకవర్గంలోని శివాలయాలు శుక్రవారం శివనామ స్వరణతో మార్మోగాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. బోధన్‌ పట్టణంలోని ప్రముఖ చక్రేశ్వరాలయంలో తెల్లవారు జామునుంచే భక్తులు పూజలు నిర్వహించారు. బోధన్‌ పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి 5 గంటల వరకు గర్భాలయ దర్శదర్శనం అనంతరం అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు వలంటీర్లను నియమించారు. రాత్రి ఉమాశంకరుల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తూము పద్మావతిశరత్‌రెడ్డి దంపతులు, ఆర్డీవో కె.గోపీరాంతో పాటు పలవురు ప్రముఖులు పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. శనివారం స్వామివారి రథోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బోధన్‌ పట్టణంలోని ఉద్మీర్‌ గల్లీలోని కార్తీక లింగేశ్వరాలయంలో , పాండు చెరువు పక్కన వున్న ఆత్మలింగేశ్వరాలయంలో అభిషేకాలు కొనసాగాయి. నర్సాపూర్‌ శివారులోని సంజీవనీ ఆంజనేయస్వామి ఆలయం ప్రాంగణంలోని శివపంచాయతనంలో అభిషేకాలు చేయించారు. బోధన్‌ మండలంలోని అమ్దాపూర్‌, చిన్నమావంది,సాలూర తదితర గ్రామాలో పలు శివాలయాల్లో పూజలు నిర్వహించారు. సాలూర సోమలింగేశ్వర ఆలయంలో ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు. శనివారం శివాలయంలో పూజలు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. ఎడపల్లి మండలంలోని జానకంపేట్‌, ఠానాకాలాన్‌, కుర్నాపల్లి, ఎడపల్లి శివాలయాల్లో  పూజలు నిర్వహించారు.


కుర్నాపల్లి శివాలయంలో జిల్లా నుడా చైర్మన్‌ దంపతులు పూజలు, శివలింగానికి అభిషేకం  నిర్వహించారు. సర్పంచ్‌ సావిత్రి దంపతులు వారిని సత్కరించారు. కోటగిరి మండలంలోని అడ్కాస్‌ లింగమయ్య గుట్ట, సులేమాన్‌ఫారం గైనీగుట్ట, పొతంగల్‌, సుంకిని సోమేశ్వర్‌ శివాలయంతో పాటు వివిధ గ్రామాల్లో శివాలయాల్లో భక్తులు పూజలు చేశారు. కోటగిరి బీసీ కాలనీలో గల మహాజన్‌ మక్తా శివాలయంలో ఉదయం 5 గంటల నుంచి భక్తులు అభిషేకం చేశారు. శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టిన వారి కోసం శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆలయం వద్ద అన్నదానం ఏర్పాటు చేసినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. రుద్రూర్‌ మండలకేంద్రంతో పాటు పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మండలకేంద్రంలో శ్రీరాజరాజేశ్వరి ఆలయం, గైని గుట్టల బసవేశ్వరాయం వద్దభక్తులు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఫలాహారం అందజేశారు. శనివారం శ్రీరాజరాజేశ్వరి ఆలయం వద్ద, గైనిగుట్టల బసవేశ్వరాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు రాజేశ్వర్‌ అప్ప, పరమేశ్వర్‌ మహారాజ్‌ తెలిపారు. చందూర్‌లోని అల్లమప్రభు శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం  ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.  మోస్రా, వర్ని మండలాల్లోని శివాలయాల్లో పూజలు నిర్వహించారు. శనివారం పలు ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.


logo