గురువారం 04 జూన్ 2020
Nizamabad - Feb 22, 2020 , 03:15:49

రివర్స్‌ పంపింగ్‌తో పుష్కలంగా నీరు

రివర్స్‌ పంపింగ్‌తో పుష్కలంగా నీరు

కోటగిరి/వర్ని/చందూర్‌: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

  • రాష్ట్ర శాసనసభా స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి
  • డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌లో నీటి ప్రవాహం పరిశీలన
  • జీపీలకు ట్రాక్టర్ల పంపిణీ

కోటగిరి/వర్ని/చందూర్‌: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి, వర్ని, చందూర్‌ మండలాల్లోని శుక్రవారం ఆయన ఇరిగేషన్‌ అధికారులతో కలిసి నిజాంసాగర్‌ కాలువలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఢీ 28/1 కాలువ వద్ద కోటగిరి మండలంలోని ఆయా గ్రామాలకు వేళ్లే కాలువలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ నిర్మాణం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని పోచారం స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయ్యాయని త్వరలోనే నిజాంసాగర్‌ వరకు నీళ్లు రానున్నాయని అన్నారు. అవి రాగానే 365 రోజులు సాగర్‌ ప్రాజెక్టులో నీరు నిండకుండలా ఉంటుందన్నారు. రెండు పంటలకు పుష్కలంగా నీరు అందిస్తామన్నారు. 


రివర్స్‌ వాటర్‌తోనే రైతులకు పుష్కలంగా నీరు

వర్ని అలీసాగర్‌ రివర్స్‌ వాటర్‌తోనే రైతులకు పుష్కలంగా నీరు అందిస్తున్నామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. రైతులు ఒకరికొకరు సహకరించుకుంటూ రెండు తడులకు నిజాంసాగర్‌ నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యాసంగిలో నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులు అనుకున్నదానికంటే ఎక్కువ పంటపొలాలను సాగు చేశారని, అయినా మొత్తం పంటలకు నీరందించాలనే సంకల్పంతో అలీసాగర్‌, నిజాంసాగర్‌ నీటితో రైతులకు సాగు నీరు అందిస్తున్నామన్నారు. అలీసాగర్‌ రివర్స్‌ వాటర్‌ ద్వారా 49 డిస్ట్రి బ్యూటరీ కెనాల్‌ నుంచి చందూర్‌ వద్ద ఉన్న 38 డిస్ట్రి బ్యూటరీ కెనాల్‌ వరకు సుమారు 35 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని తెలియజేశారు. అలీసాగర్‌ రివర్స్‌ వాటర్‌ ఉపయోగించుకుని నిజాంసాగర్‌ నీటిని మిగతా డిస్ట్రిబ్యూటరిలన్నింటి ద్వారా సుమారు 90 వేల ఎకరాలకు రెండు తడులకు నీరందిస్తున్నామని స్పీకర్‌ అన్నారు. ఈ నీటితో చెరువులు నింపుకుని ఉపయోగించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతుల కోరిక మేరకు రెండవ విడత నీరు వదులుతామని స్పీకర్‌ తెలియజేశారు. త్వరలో జాకోర, చందూర్‌ గ్రామాల వద్ద లిప్టు ఇరిగేషన్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధ్దమైందని స్పీకర్‌ తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి నిర్మాణాలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. 


రైతులు నీటిని వృథా చేయొద్దు 

నీటిని రైతులు వృథా చేయకుండా అవసరం మేరకు వినియోగించుకోవాలని పోచారం కోరారు. నిజాంసాగర్‌లో 3 టీఎంసీల నీరే ఉన్నా పంటలను రక్షించాలన్న ఉద్దేశంతో  నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. స్పీకర్‌ వెంట  ఆర్డీవో గోపిరాం, తహసీల్దార్లు విఠల్‌, ముజీప్‌ , కోటగిరి జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, వర్ని జడ్పీటీసీ హరిదాసు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సంజీవులు, వైస్‌ చైర్మన్‌ నామాల సాయిబాబు, టీఆర్‌ఎస్‌ వర్ని మండల అధ్యక్షుడు కల్లాల్‌ గిరి, కార్యదర్శి వెలగపూడి గోపాల్‌, వైస్‌ ఎంపీపీ దండ్ల బాల్‌రాజ్‌, కోటగిరి మండల కన్వీనర్‌ ఎజాజ్‌ఖాన్‌, జడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ సిరాజ్‌, కామారెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజీరెడ్డి, టీఆర్‌ఎస్‌ చందూర్‌ మండల అధ్యక్షుడు మూడ్‌ అంబర్‌సింగ్‌, ఇరిగేషన్‌ ఈఈ మధుకర్‌రెడ్డి, డీఈ పావని, ఏఈ శృతి, ఆయా శాఖల అధికారులు, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నానిబాబు, సర్పంచులు, నాయకులు ఉన్నారు.


logo